ఆర్డినెన్స్‌ల స్థానంలో తీసుకొచ్చిన బిల్లులపై గురువారం శాసనసభలో చర్చ జరగనుంది. ప్రైవేట్ విశ్వవిద్యాలయాల ఏర్పాటు, విపత్కర సమయాల్లో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాల్లో కోత, ఆయుష్ వైద్యుల పదవీవిరమణ వయస్సు పెంపు, కేంద్ర మార్గదర్శకాలకు అనుగుణంగా అదనపు అప్పులు తీసుకునేలా ప్రభుత్వం గతంలో ఆర్డినెన్స్‌లు తీసుకొచ్చింది. వాటి స్థానంలో బిల్లులపై గురువారం అసెంబ్లీలో చర్చించనున్నారు.
కొత్తూరు పురపాలిక ఏర్పాటు నేపథ్యంలో కొత్తూరు, తిమ్మాపూర్ గ్రామాపంచాయతీల తొలగింపు కోసం ముసాయిదా నోటిఫికేషన్‌ను పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సభ ముందు ఉంచుతారు. శాసనసభ ప్రశ్నోత్తరాల్లో పామాయిల్ సాగు, ఆసరా ఫించన్లు, తండాలు పంచాయతీలుగా మార్చడం, సంగారెడ్డిలో ప్రభుత్వ వైద్యకళాశాల, విద్యుత్ శాఖలో జూనియర్ లైన్ మెన్ ఉద్యోగాల భర్తీ అంశాలు చర్చకు రానున్నాయి.