మేడ్చల్‌లోని నాగప్ప మల్టీ బ్రాండ్ బైక్ షోరూమ్‌లో బైక్ సర్వీసింగ్ చేసిన నీటి కోసం తవ్విన గుంత ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆదివారం సాయంత్రం సాయంత్రం బైక్ షోరూం పక్కనే ఉన్న మైదానంలో ఆడుకోవడానికి వెళ్లిన ఆంజనేయులు అనే నాలుగేళ్ల బాలుడు గుంతలో పడి మృతి చెందిన ఘటన చుట్టుపక్కల ప్రజలని ఆందోళనకు గురిచేస్తుంది.
బైక్ సర్వీసింగ్ గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి - హైదరాబాద్‌లో నాలుగేళ్ల బాలుడు మృతి
మేడ్చల్ పట్టణంలోని బైక్ సర్వీసింగ్ కోసం తవ్విన గుంత నాలుగు సంవత్సరాల బాలుడి ప్రాణాలు తీసింది.
బైక్ సర్వీసింగ్ గుంతలో పడి నాలుగేళ్ల బాలుడు మృతి
మృతుడి కుటుంబం సిద్దిపేట జిల్లా తొగుట గ్రామం నుంచి బతుకుదెరువు కోసం సంవత్సరం క్రితమే మేడ్చల్‌కు వచ్చి నివసిస్తున్నారు. ఇంతలోనే ఇలా జరగడం వల్ల వారు కన్నీరుమున్నీరవుతున్నారు. దీనికి కారణమైన బైక్ షోరూమ్ యాజమానిపై చర్యలు తీసుకోవాలని బాలుడి తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బైక్ షోరూమ్ అక్రమ కట్టడమని దీనికి అనుమతి ఇచ్చిన అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేశారు.