తెలంగాణ

telangana

ETV Bharat / state

Four Train Services Extended Today in Telangana : నేడే నాలుగు రైలు సర్వీసులు ప్రారంభం.. జెండా ఊపి ప్రారంభించనున్న కిషన్‌రెడ్డి - రేపు నాలుగు రైళ్లను పొడిగించనున్న కిషన్‌రెడ్డి

Four Train Services Extended in Telangana : దక్షిణ మధ్య రైల్వే నాలుగు రైలు సర్వీసులను పొడిగించింది. ఈ పొడిగించిన రైలు సర్వీసులను ఈరోజు కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి జెండా ఊపి ప్రారంభించనున్నారు. ముందుగా ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని దక్షిణ మధ్య రైల్వే అధికారులు విజ్ఞప్తి చేశారు.

Four Train Services Extended
Four Train Services Extended Today in Telangana

By ETV Bharat Telangana Team

Published : Oct 9, 2023, 5:58 AM IST

Four Train Services Extended in Telangana : తెలంగాణ ప్రాంతంలో దక్షిణ మధ్య రైల్వే(South Central Railway) నాలుగు రైలు సర్వీసులను పొడిగించింది. ఈ రోజు ఉదయం 8.45 గంటలకు పొడిగించిన రైలు సర్వీసులను జెండా ఊపి కేంద్రమంత్రి కిషన్‌ రెడ్డి(Kishan Reddy) ప్రారంభించనున్నారు. సికింద్రాబాద్‌లో జరిగే ఈ కార్యక్రమంలో రాష్ట్రమంత్రులు తలసాని శ్రీనివాస యాదవ్‌, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావు, దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ అరుణ్‌ కుమార్‌ జైన్‌, ఇతర సీనియర్‌ రైల్వే అధికారులు పాల్గొనున్నారని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది.

హడప్సర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కాజీపేట వరకు పొడిగించారు. అలాగే జైపూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూలు సిటీ వరకు పొడిగిస్తూ దక్షిణ మధ్య రైల్వే నిర్ణయం తీసుకుంది. నాందేడ్‌-తాండూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును రాయచూర్‌ వరకు.. కరీంనగర్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకు పొడిగించారు. ఈ పొడిగించిన నాలుగు రైళ్ల సర్వీసులకు(Four Trains Extended in Telangana) బుకింగ్‌లు అందుబాటులో ఉంచినట్లు దక్షిణ మధ్య రైల్వే శాఖ తెలిపింది. నేటి నుంచి పొడిగించిన 17014/17013 కాజీపేట రైలు సికింద్రాబాద్‌ నుంచి బయలుదేరుతుంది.

Amrit Bharat Station Scheme : 'రూ.300 కోట్లతో హైదరాబాద్ నుంచి యాద్రాద్రికి ఎంఎంటీఎస్‌'

Four Train Services Extended in Telangana : ఈరోజు నుంచి పుణె(హదాప్సర్‌)-కాజీపేట-పుణె(హదాప్సర్‌) రైలు సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి బయలుదేరుతుందని దక్షిణ మధ్య రైల్వే శాఖ వెల్లడించింది. ఇప్పటివరకు ఈ రైలు హైదరాబాద్‌ స్టేషన్‌ నుంచి బయలుదేరి వెళ్లగా.. ఇక నుంచి సికింద్రాబాద్‌ స్టేషన్‌ నుంచి వెళుతుందని అధికారులు తెలిపారు. కనుక ఈ విషయాన్ని ప్రయాణికులు అందరూ గమనించాలని విజ్ఞప్తి చేశారు. హడప్సర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ కాజీపేట వరకు పొడిగించిన సర్వీసును సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌ నుంచి మిగిలిన మూడు రైళ్లను దృశ్యమాధ్యమం ద్వారా ప్రారంభించనున్నట్లు రైల్వే శాఖ ప్రకటనలో తెలిపింది. దీంతో ఈ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులకు శుభవార్త అందించినట్లు అయింది.

పొడిగించిన నాలుగు రైళ్ల సర్వీసుల వివరాలు :

  • హడప్సర్‌-హైదరాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును కాజీపేట వరకు పొడిగించారు.
  • జైపూర్‌-కాచిగూడ ఎక్స్‌ప్రెస్‌ను కర్నూలు సిటీ వరకు పొడిగించారు.
  • నాందేడ్‌-తాండూరు ఎక్స్‌ప్రెస్‌ రైలును రాయచూర్‌ వరకు పొడిగించారు.
  • కరీంనగర్‌-నిజామాబాద్‌ ఎక్స్‌ప్రెస్‌ను బోధన్‌ వరకు పొడిగించారు.

ఈ ఏడాదే కాజీపేట టు విశాఖపట్టణం రైలును మహబూబ్‌నగర్‌ వరకు పొడిగిస్తూ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. దీంతో ఈ ప్రాంతానికి వెళ్లే ప్రయాణికులకు కాస్త ఉపశమనం లభించినట్లు అయింది. సిద్దిపేట నుంచి సికింద్రాబాద్‌కు మొట్టమొదటి రైలును నిజామాబాద్‌లో అక్టోబర్‌ 4న ప్రధాని మోదీ వర్చువల్‌గా ప్రారంభించారు. ఈ రైలును సిద్దిపేట నుంచి ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డితో కలిసి హరీశ్‌రావు జెండా ఊపి ప్రారంభించారు. ఈ రైలులో మంత్రి హరీశ్‌రావు.. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావు ప్రయాణించారు.

Ind Vs Pak World Cup 2023 : భారత్‌-పాక్‌ మ్యాచ్‌కు వందే భారత్‌ ప్రత్యేక రైళ్లు.. ఫ్యాన్స్​కు సూపర్​ ఛాన్స్​.. మీరు వెళ్తారా?

మరో 9 నగరాలకు వందే భారత్.. ఒకేసారి 5 రైళ్లకు జెండా ఊపిన మోదీ

ABOUT THE AUTHOR

...view details