తెలంగాణ

telangana

ETV Bharat / state

చెన్నైకి తాగునీరు ఇచ్చేందుకు నాలుగు రాష్ట్రాల అంగీకారం - తమిళనాడు కోరితే నీటి విడుదలకు సిద్ధమన్న నాలుగు రాష్ట్రాలు

చెన్నై ప్రజలకు తాగునీరు అవసరాల కోసం కేటాయించిన కృష్ణ జలాలను ఇచ్చేందుకు నాలుగు రాష్ట్రాలు అంగీకరించాయి. తమిళనాడు కోరితే నీటి విడుదలకు సిద్ధమని కృష్ణానది యాజమాన్య బోర్డుకు తెలిపాయి. బోర్డు ఛైర్మన్ పరమేశం ఆధ్వర్వంలో నిర్వహించిన వర్చువల్​ సమావేశంలో జరిగింది.

Four states agree to provide drinking water to Chennai
చెన్నైకి తాగునీరు ఇచ్చేందుకు నాలుగు రాష్ట్రాల అంగీకారం

By

Published : Jan 19, 2021, 9:01 PM IST

తమిళనాడు కోరితే చెన్నై తాగునీటి అవసరాల కోసం కేటాయించిన కృష్ణజలాలను ఇచ్చేందుకు సిద్ధమని తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక అంగీకారం తెలిపాయి. కృష్ణానది యాజమాన్య బోర్డు ఛైర్మన్ పరమేశం నేతృత్వంలో చెన్నై తాగునీటి కమిటీ సమావేశం వర్చువల్ విధానంలో జరిగింది.

నీటి వాటా 15 టీఎంసీల్లో ఇప్పటికే ఆరు టీఎంసీలకు పైగా నీరు విడుదల చేసినట్లు ఇంజనీర్లు తెలిపారు. ప్రస్తుతం తాగునీటికి ఇబ్బంది లేదని.. ఏప్రిల్ నెల నుంచి నీరు ఇవ్వాలని తమిళనాడు కోరింది. ప్రవాహ నష్టాలు లేకుండా పైపులైను వేసుకునే అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిశీలనలో ఉందని ఆ రాష్ట్ర ఇంజనీర్లు తెలిపారు. ఈ సమావేశంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహరాష్ట్ర, కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల అధికారులు, ఇంజనీర్లు పాల్గొన్నారు.

ఇదీ చూడండి :హైదరాబాద్​లో అభివృద్ధి పనులు ప్రారంభించనున్న కేటీఆర్

ABOUT THE AUTHOR

...view details