తెలంగాణ

telangana

ETV Bharat / state

Mahanadu: మహనాడులో తెలంగాణ తీర్మానాలు

తెలంగాణలో ఆర్థిక అసమానలతో పాటు రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అరవింద కుమార్ గౌడ్ ప్రవేశపెట్టిన సంక్షేమానికి 'కోతలు-మారని బడుగు, బలహీన వర్గాల తలరాతలు' అంశంపై తీర్మానాన్ని తాజుద్దీన్, అశోక్​లు బలపరిచారు.

telangana in mahanadu
మహనాడులో తెలంగాణ

By

Published : May 27, 2021, 10:34 PM IST

Updated : May 27, 2021, 10:39 PM IST

తెలంగాణ రాష్ట్రంలో సంక్షేమం ద్వారా ఆర్థిక అసమానతలు తొలగించటంతో పాటు రాజకీయంగా బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇవ్వాలని తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఆకాంక్షించారు. ఏపీ, తెలంగాణ రెండూ అగ్రస్థానంలో ఉండాలని.. తాను నిరంతరం తపిస్తానని వెల్లడించారు. హైదరాబాద్ రాజధానిగా సంపద సృష్టించే ప్రక్రియకు తాను శ్రీకారం చుడితే.. తర్వాత వచ్చిన ప్రభుత్వాలు ఆ అభివృద్ధిని కొనసాగిస్తున్నాయన్నారు. ప్రస్తుతం ఏపీలో మాత్రం పరిస్థితి అందుకు భిన్నంగా ఉందన్నారు.

తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి అరవింద కుమార్ గౌడ్ ప్రవేశపెట్టిన సంక్షేమానికి 'కోతలు-మారని బడుగు, బలహీన వర్గాల తలరాతలు' అంశంపై తెలంగాణ తీర్మానాన్ని తాజుద్దీన్, అశోక్​లు బలపరిచారు. ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చి వాటిని తెరాస ప్రభుత్వం విస్మరించిందని నేతలు విమర్శించారు. ఇన్నాళ్లు పార్టీకి ఓ చిన్న మచ్చలా ఉన్న ఓటుకు నోటు వ్యవహారంపై క్లీన్ చిట్ రావటం సంతోషమంటూ హర్షం వ్యక్తం చేశారు.

మహనాడులో తెలంగాణ

ఇదీ చదవండి:BJP: ఆయనొస్తానంటే ఈయనకు కోపమొచ్చింది..!

Last Updated : May 27, 2021, 10:39 PM IST

ABOUT THE AUTHOR

...view details