తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీలో బ్లాక్​ ఫంగస్ కలకలం - ఏపీపై బ్లాక్ ఫంగస్ తీవ్ర ప్రభావం

ఏపీని బ్లాక్‌ ఫంగస్‌ భయపెడుతోంది. రోజురోజుకు పెరుగుతోన్న మ్యూకర్​మైకోసిస్ బాధితుల సంఖ్య ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటికే ఫంగస్ బారిన నలుగురు మృతి చెందారు.

black fungus cases in ap
black fungus cases in ap

By

Published : May 18, 2021, 3:00 PM IST

ఏపీలో ప్రబలుతోన్న ప్రాణాంతక బ్లాక్‌ ఫంగస్‌ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తోంది. ఓ వైపు కొవిడ్‌.. మరో వైపు మ్యూకర్​ మైకోసిస్​తో బాధపడుతోన్న రోగుల సంఖ్య క్రమంగా పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటి వరకు అధికారికంగా 10కి పైగా బ్లాక్‌ ఫంగస్‌ కేసులు నమోదవ్వగా.. ఇందులో నాలుగు మరణాలు చోటుచేసుకున్నాయి.

కృష్ణా, ప్రకాశం జిల్లాలకు చెందిన ఇద్దరు ఫంగస్ బారిన పడి మరణించారు. ప్రకాశం జిల్లాకు చెందిన మరో ఇద్దరు హైదరాబాద్, చెన్నై ఆస్పత్రుల్లో చికిత్స పొందుతూ మృతి చెందారు. ప్రైవేట్ ఆస్పత్రులకు వచ్చే బ్లాక్ ఫంగస్ కేసుల సంఖ్య వందల్లో ఉంటుంది. పరిస్థితులను బట్టి చూస్తుంటే.. గ్రామీణ ప్రాంతాల ప్రజలూ ఫంగస్ గుప్పిట్లో చిక్కుకున్నట్లుగా కన్పిస్తోందని వైద్య నిపుణులు చెబుతున్నారు.

బ్లాక్‌ఫంగస్‌ కేసులు క్రమంగా బయట పడుతుండటంతో బాధితుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందన్న అభిప్రాయాన్ని వైద్య వర్గాలు వ్యక్తం చేస్తున్నాయి. చాలా కేసుల్లో కొవిడ్‌ బారిన పడి కోలుకున్న తర్వాత ముక్కు, చెవి గొంతు ద్వారా సంక్రమించే ఈ ఫంగస్‌ చివరకు వ్యక్తులకు ప్రాణంతకమవుతోంది. కరోనా తగ్గందనుకున్న వారిలో కన్ను, దవడ వాపు వంటి లక్షణాలు కొందరిలో దంత సమస్యలు వస్తున్నాయి. బ్లాక్‌ ఫంగస్‌ గురించి తెలియని వారు హోం ఐసోలేషన్‌తో ఇంటి వద్ద చికిత్స పొందుతున్నారు. కాస్తో.. కూస్తో వైద్య పరిజ్ఞాణం ఉన్న వారు వైద్యులను ఆశ్రయిస్తున్నారు.

అసలు బ్లాక్ ఫంగస్ అంటే ఏమిటి?

బ్లాక్‌ ఫంగస్​ను వైద్య పరిభాషలో మ్యూకర్‌ మైకోసిస్​గా చెబుతారు. కళ్లు, మెదడుపై దాడి చేసే ఈ ఫంగస్‌ సకాలంలో గుర్తించక పోతే చివరకు ప్రాణాలను హరిస్తుంది. చెవి, ముక్కు, గొంతు వ్యాధుల చికిత్స నిపుణుల పర్యవేక్షణలో వ్యాధిని గుర్తించి అవసరమైన మందులు ఇస్తారు. రాష్ట్రంలో బ్లాక్‌ ఫంగస్‌ ప్రమాదం పొంచి ఉన్న మాట వాస్తవమేనని ఆంధ్ర వైద్య కళాశాల ప్రిన్సిపాల్‌ సుధాకర్‌ ఈటీవీ భారత్‌కు తెలిపారు.

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఈ ఫంగస్‌ బాధితులకు.. ఆరోగ్యశ్రీ కింద చికిత్స చేస్తుందని ప్రకటించింది. బ్లాక్‌ ఫంగస్‌ బాధితులు.. ప్రభుత్వానికి సమాచారం అందచేయాలని వైద్యారోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి సింఘాల్ తెలిపారు. ఫంగస్‌ బారిన పడి ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న వారి వివరాలు ప్రభుత్వానికి తెలపాలని ఆయా నిర్వాహకులను సింఘాల్‌ కోరారు.

ఇదీ చదవండి:అధికారం శాశ్వతమనుకుంటే భ్రమలో ఉన్నట్లే : ఈటల

ABOUT THE AUTHOR

...view details