తెలంగాణ

telangana

ETV Bharat / state

తొమ్మిది రోజుల్లో... ఒకే కుటుంబంలో నలుగురు మృతి - తొమ్మిది రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

హైదరాబాద్​ అంబర్​పేటలో తొమ్మిది రోజుల్లో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతిచెందారు. తల్లిదండ్రుల అకాల మరణం జీర్ణించుకోలేక ఈనెల 11న వారి పిల్లలు ఆత్మహత్యకు పాల్పడ్డారు. కుమారుడు ఈనెల 15నే మరణించగా.. కుమార్తె నిన్న తుదిశ్వాస విడిచింది.

Four of the same family died in nine days

By

Published : Jul 18, 2019, 2:14 AM IST

హైదరాబాద్​ అంబర్​పేట డీడీ కాలనీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. తొమ్మిది రోజుల వ్యవధిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృత్యువాత పడ్డారు.

తల్లిదండ్రుల అకాల మరణం తట్టుకోలేని వారి కుమార్తె, కుమారుడు నిఖిల్​ కర్బందా, మన్ను కర్బందా ఈనెల 11న శీతల పానీయంలో నిద్రమాత్రలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఇది గమనించిన స్థానికులు గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆరోగ్యం విషమించి ఈనెల 15న నిఖిల్​ మరణించగా.. మృత్యువుతో పోరాడి మన్ను కర్బందా నిన్న సాయంత్రం మూడు గంటలకు తుదిశ్వాస విడిచింది. కేవలం తొమ్మిది రోజుల వ్యవధిలోనే కుటుంబ సభ్యులంతా మరణించడం వల్ల అంబర్​పేట డీడీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బంసిలాల్​పేట స్మశానవాటికలో మన్ను అంత్యక్రియలు నిర్వహించారు.

ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి

ఇవీచూడండి: భార్యపిల్లలను వేధించాడు... ఉరేసుకున్నాడు

For All Latest Updates

TAGGED:

ABOUT THE AUTHOR

...view details