తెలంగాణ

telangana

ETV Bharat / state

వనస్థలిపురంలో మరో 4 కరోనా కేసులు.. 17కు చేరిన సంఖ్య - vanasthalipuram covid 19 cases

హైదరాబాద్ వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా విస్తరిస్తోంది. తాజాగా కేసుల సంఖ్య 17కు చేరింది. ఈ నేపథ్యంలో టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి కంటైన్మెంట్ ప్రాంతాల్లో పర్యటించారు. కాలనీ వాసులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు.

వనస్థలిపురంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్
వనస్థలిపురంలో మరో నలుగురికి కరోనా పాజిటివ్

By

Published : May 5, 2020, 8:29 PM IST

హైదరాబాద్ వనస్థలిపురంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఇప్పటి వరకు ఇక్కడ కేసుల సంఖ్య 17కు చేరింది.

క్రమంగా విస్తరిస్తోన్న మహమ్మారి...

హిల్స్ కాలనీలో ఓ వృద్ధురాలు కరోనా బారినపడగా ఆమెకు ప్రైమరీ కాంటాక్ట్​లో ఉన్న వారి నమూనాలు సేకరించారు. వారిలో వృద్ధురాలి కుమార్తె, అల్లుడు, ఇద్దరు మనవళ్లకు కరోనా వైరస్ సోకినట్లు జిల్లా వైద్యాధికారులు వెల్లడించారు.

మర్కజ్ విషయంలోనూ అంతే...

గతంలో మర్కజ్ కేసుల విషయంలోనూ ఓ వ్యక్తి కరోనా బారినపడి కోలుకోగా, అస్సోంకు చెందిన మరో వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.

ఆస్పత్రికి.. మరో ముగ్గురి నమూనాలు !

ఈ క్రమంలోనే హుడా సాయినగర్​లో కరోనా బాధిత కుటుంబంలో జలుబు, జ్వరంతో బాధపడుతున్న మరో ముగ్గురి నమూనాలు సేకరించారు. అనంతరం అనుమానితులను కింగ్ కోఠిలోని ఆస్పత్రికి తరలించారు. మరోవైపు ఫీవర్ సర్వైలెన్స్​లో భాగంగా కంటైన్మెంట్ జోన్లలో వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది సర్వే చేస్తున్నారు. గర్భిణీలు, చిన్నపిల్లలపై ప్రత్యేక దృష్టిసారించి వివరాలు సేకరిస్తున్నారు. ఇప్పటికే హోం క్వారంటైన్​లో ఉన్న 169 కుటుంబాలను నిత్యం పర్యవేక్షిస్తున్నారు.

కరోనా బారిన 6, 6, 3

కరోనా వైరస్ వ్యాప్తితో వనస్థలిపురంలోని ఒక కుటుంబంలో ఆరుగురు, మరో కుటుంబంలో ఆరుగురు, ఇంకో కుటుంబంలో ముగ్గురు వైరస్ బారినపడ్డారు. ఫలితంగా స్థానికుల్లో ఆందోళన మరింత తీవ్రమైంది. క్రమంగా కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో మల్కాజ్​గిరి ఎంపీ రేవంత్ రెడ్డి హుడా సాయినగర్ కాలనీని సందర్శించి స్థానికులతో మాట్లాడారు.

ఇవీ చూడండి : క్షౌరశాలలు లేకుంటేనేం.. మీకు నేనున్నానంటున్న మహిళ.!

ABOUT THE AUTHOR

...view details