తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో డ్రగ్స్​ కలకలం.. హాష్ ఆయిల్​ విక్రయించే ముఠా అరెస్ట్​ - తెలంగాణ నేర వార్తలు

Drug Gange Arrested: హైదరాబాద్​లో డ్రగ్స్​ ముఠాను మత్తు నిరోధక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. సీసాలో హాష్ ఆయిల్ పోసి ఈ ముఠాను విక్రయిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. నలుగురు నిందితులను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

drugs gange arrest
డ్రగ్స్​ ముఠా అరెస్టు

By

Published : Jan 3, 2023, 7:53 PM IST

Drug Gange Arrested: మాదకద్రవ్యాలు విక్రయిస్తున్న నలుగురు సభ్యుల ముఠాను మత్తు పదార్ధాల నిరోధక విభాగం పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 400 లీటర్ల హాష్‌ ఆయిల్‌తో పాటు మూడు సెల్​ఫోన్​లు, కారు స్వాధీనం చేసుకున్నారు. కుత్బులాపూర్‌కు చెందిన ప్రవీణ్‌కుమార్‌, పటాన్‌చెరు వాసి మోహన్‌ యాదవ్‌, కల్యాణ్​, సురేశ్​ కలిసి మత్తు దందా సాగిస్తున్నట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది.

ఆంధ్రప్రదేశ్​లోని విశాఖపట్నం జి.మాడుగుల మండలంలోని గంజాయి సాగు చేసే వారితో పరిచయం పెంచుకున్నాడు. వారి ద్వారా గంజాయి నుంచి తీసిన హాష్‌ ఆయిల్‌ సేకరించి ఆయిల్‌ను ప్రవీణ్‌.. హైదరాబాద్‌, బెంగళూరు నగరాల్లోని మత్తుపదార్ధాల దందా చేసే వారికి సరఫరా చేస్తున్నాడు. ఈ క్రమంలో నిందితుడు మిగితా ముగ్గురితో కలిసి ముఠా ఏర్పాటు చేసుకున్నాడు.

సీసాలో హాష్‌ ఆయిల్‌ పోసి ముఠా విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిందితుల వద్ద నుంచి 60 హాష్‌ ఆయిల్‌ సీసాలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అరెస్టు చేసిన పోలీసులు రిమాండ్‌కు తరలించారు.

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details