తెలంగాణ

telangana

ETV Bharat / state

Bio Asia Summit 2024 : బయో ఆసియా సదస్సు 2024లో ప్రసంగించే ప్రముఖుల పేర్లు ఖరారు.. లిస్ట్​ ఇదే

Bio Asia Summit 2024 : హైదరాబాద్‌ వేదికగా వచ్చే ఏడాది జరగనున్న బయో ఆసియా సదస్సుకు హాజరై ప్రసంగించే ప్రముఖుల పేర్లను ప్రభుత్వం ఖరారు చేసింది. నలుగురు అంతర్జాతీయ ప్రముఖ సంస్థల సీఈవోలు హాజరు కానున్నట్లు తెలిపింది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు 21వ బయో ఆసియా సదస్సు జరగనుంది.

Bio Asia Summit 2024 in Hyderabad
Four Global CEOs will Attend to Bio Asia Summit 2024

By ETV Bharat Telangana Team

Published : Sep 30, 2023, 9:49 PM IST

Bio Asia Summit 2024 :వచ్చే ఏడాది ఫిబ్రవరిలో హైదరాబాద్ వేదికగా జరగనున్న బయో ఆసియా సదస్సుకు నలుగురు అంతర్జాతీయ ప్రముఖ సంస్థల సీఈవోలు హాజరు కానున్నారు. 21వ బయో ఆసియా సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు జరగనుంది. డాటా అండ్ ఏఐ - రీడిఫైనింగ్ పాసిబిలిటీస్ థీమ్​తో హైదరాబాద్ వేదికగా జరగనున్న సదస్సుకు హాజరై ప్రసంగించే ప్రముఖుల పేర్లను ఖరారు చేశారు. నలుగురు గ్లోబల్ సీఈవోలు బయో ఆసియా వేదికను అలంకరించడం ఇదే మొదటి సందర్భమని.. అపూర్వమైన ఈ సమావేశం గ్లోబల్ హబ్‌గా(Global Hub) హైదరాబాద్​కు పెరుగుతున్న ప్రాధాన్యతను వివరిస్తుందనిరాష్ట్ర ప్రభుత్వంపేర్కొంది.

Bio Asia Summit 2024 : 2024 బయో ఆసియా సదస్సు తేదీలు ప్రకటించిన మంత్రి కేటీఆర్.. ఈసారి థీమ్​ ఇదే

ఆ నలుగురు ఎవరెవరంటే..? ప్రపంచ ఫార్మాస్యూటికల్ దిగ్గజం ఎలిలిల్లీ సంస్థ సీఈఓ డేవ్ రిక్స్, ఫార్మా పరిశ్రమలో అత్యంత విశిష్ట వ్యక్తి బీఎంస్ సంస్థ ఇన్​కమింగ్ సీఈఓ క్రిస్ బోర్నర్, అద్భుత ఆవిష్కరణల వైపు నడిపిస్తున్న మెడ్ ట్రానిక్ సంస్థ ఛైర్మన్ జెఫ్ మార్తా, గ్లోబల్ ఫార్మా నిపుణులు టకేడా సంస్థ సీఈఓ క్రిస్టోఫ్ వెబర్ సదస్సులో కీలకోపన్యాసాలు చేయనున్నట్లు ప్రకటించింది.

ఆక్సిజన్ సెన్సింగ్​పై సంచలన కృషితో 2019లో నోబెల్ బహుమతిపొందిన ప్రొఫెసర్ గ్రెస్ సెమెంజా కూడా సదస్సుకు హాజరు కానున్నారు. వారి అనుభవాలతో 2024 బయోఆసియా సదస్సు ఘనంగా జరిగి ఫార్మా, లైఫ్ సైన్సెస్(Life sciences) రంగాల్లో నైపుణ్యాలు మరింత విస్తృతం అవుతాయని ప్రభుత్వం ఆశాభావం వ్యక్తం చేసింది.

KTR on Bio Asia 21st Edition : ఆవిష్కరణలు, పరిశోధనల పట్ల తెలంగాణకు ఉన్న నిబద్ధతకు బయో ఆసియా సదస్సు ప్రాధాన్యత ప్రతిబింబంగా నిలుస్తుందని.. హెల్త్ కేర్ రంగ భవిష్యత్​ను సమూలంగా మారుస్తోన్న దూరదృష్టి కలిగిన నాయకులకు ఆతిథ్యం ఇవ్వడం గర్వకారణమని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఈ సమ్మిట్ అర్థవంతమైన చర్చలతో.. బయో ఆసియా వారసత్వాన్ని కొనసాగిస్తుందని కేటీఆర్ ఆశాభావం వ్యక్తం చేశారు.ఆలోచనలు, భాగస్వామ్యాలను(Partnerships) పంచుకోవడం ద్వారా విప్లవాత్మక మార్పులకు ఇది ఎప్పుడూ తోడ్పడుతుందని వివరించారు.

'ఆ మూడు అంశాలే దేశాన్ని ప్రగతి బాటలో నడిపిస్తాయి'..

Bio Asia Summit 2024 in Hyderabad : ఈ ఏడాది థీమ్.. డేటా, కృతిమ మేధను సమ్మిళితం చేస్తూ లైఫ్ సైన్సెస్, హెల్త్​కేర్ రంగాల్లో అవకాశాలు వంటివి కొత్త శకానికి నాంది పలుకుతుందని కేటీఆర్పేర్కొన్నారు. హైదరాబాద్ వేదికగా ప్రపంచస్థాయి మేధావుల సమ్మేళనంతో పరివర్తన దిశగా.. నూతన సవాళ్లను అధిగమించేందుకు సిద్ధంగా ఉన్నామని వివరించారు. దీని ప్రభావం ప్రపంచస్థాయిలో ఉంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. 2024 బయో ఆసియా సదస్సు గేమ్ ఛేంజర్ అవుతుందన్న సీఈఓ శక్తి నాగప్పన్.. గ్లోబల్ సీఈఓల రాక సదస్సుకు పెరుగుతున్న ప్రాధాన్యాన్ని వివరిస్తుందని అన్నారు.

ABOUT THE AUTHOR

...view details