ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో నియోజకవర్గ పరిధిలో నాలుగు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. కరోనా వ్యాప్తిని అరికట్టడానికి జీహెచ్ఎంసీ అధికారులు జాగ్రత్తలకు ఉపక్రమించారు. కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేసి ఏ రోజుకారోజు కరోనా బాధితుల సమాచారం సేకరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. జీహెచ్ఎంసీ వైద్య సిబ్బంది, అధికారులు సమన్వయంతో పటిష్టమైన చర్యలకు శ్రీకారం చుట్టారు.
ముషీరాబాద్‌లో నాలుగు కంటైన్మెంట్ జోన్లు
నగరంలో కరోనా కేసుల ఉద్ధృతి రోజురోజుకు పెరుగుతుంది. కేసులు వ్యాపించకుండా ఎక్కడికక్కడ కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేస్తున్నారు. ముషీరాబాద్ నియోజకవర్గంలో కరోనా కేసులు పెరుగుతున్న కారణంగా నాలుగు కంటైన్మెంట్ జోన్లు ఏర్పాటు చేశారు. అధికారులు ఎప్పటికప్పుడు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు.
నియోజకవర్గంలోని కవాడిగూడ సాయిబాబా దేవాలయ పరిసరాలు, ముషీరాబాద్ చేపల మార్కెట్, రాంనగర్ హరి నగర్, రిశాల ప్రాంతాలను కంటైన్మెంట్ జోన్లుగా ప్రకటించినట్లు జీహెచ్ఎంసీ అధికారులు తెలిపారు. ముషీరాబాద్, రాంనగర్, భోలక్ పూర్, కవాడిగూడ, గాంధీ నగర్, అడిక్‌మెట్ డివిజన్లలో కొత్తగా 63 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 47 మంది డిశ్చార్జ్ అయ్యారు. మరణాల సంఖ్య తగ్గినప్పటికీ.. కరోనా కేసులు మాత్రం ఏరోజుకారోజు పెరుగుతూనే ఉన్నాయి. జీహెచ్ఎంసీ, వైద్య సిబ్బంది కంటైన్మెంట్ ప్రాంతాల పట్ల అప్రమత్తమై.. పటిష్టమైన చర్యలు చేపడుతున్నప్పటికీ ప్రజలు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అన్ని ప్రాంతాల్లో రసాయనాల పిచికారి చేయాలని స్థానికులు కోరుతున్నారు.
ఇవీ చూడండి: తెలంగాణలో ఎంతశాతం మంది కరోనాను జయించారో తెలుసా?