తెలంగాణ

telangana

ETV Bharat / state

'నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎలాంటి నోటీసులు రాలేదు' - Anjankumar Yadav Latest News

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎలాంటి నోటీసులు రాలేదని నలుగురు కాంగ్రెస్‌ నాయకులు పేర్కొన్నారు. షబ్బీర్ అలీ, గీతారెడ్డి, సుదర్శన్‌ రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌లకు ఈడీ నోటీసులు ఇచ్చిందని కథనాలు వచ్చాయి. ఇప్పటి వరకు ఈడీ నుంచి నోటీసులు అందలేదని వారు స్పష్టం చేశారు.

కాంగ్రెస్‌
కాంగ్రెస్‌

By

Published : Sep 23, 2022, 2:07 PM IST

Updated : Sep 23, 2022, 2:15 PM IST

నేషనల్‌ హెరాల్డ్‌ కేసులో ఎలాంటి నోటీసులు రాలేదని రాష్ట్ర కాంగ్రెస్‌ నేతలు స్పష్టం చేశారు. షబ్బీర్‌ అలీ, గీతారెడ్డి, సుదర్శన్‌రెడ్డి, అంజన్‌కుమార్‌ యాదవ్‌కు ఈడీ నోటీసులు ఇచ్చిందని కథనాలు వచ్చాయి. ఇప్పటివరకు ఎలాంటి నోటీసులు అందలేదని తెలిపారు. పార్టీ విరాళం కింద డబ్బులు ఇచ్చింది వాస్తవమేనని పేర్కొన్నారు. తాము చెక్కుల రూపంలో ఇచ్చామని.. నోటీసులు వస్తే ఈడీ విచారణకు హాజరవుతామని వెల్లడించారు. . తామేమీ నేరం చేయలేదని... ఈడీకి భయపడటం ఎందుకని ప్రశ్నించారు.

ఇప్పటికే నేషనల్ హెరాల్డ్ కేసు ప్రస్తుతం దేశం మొత్తాన్ని కుదిపేస్తోంది. కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ, రాహుల్​ గాంధీకి ఈడీ సమన్లు పంపింది. నేషనల్ హెరాల్డ్​ పత్రికలో అవకతవకలు జరిగాయని అధికార భాజపా విమర్శలు కురిపిస్తుంటే.. ప్రతిపక్ష కాంగ్రెస్ మాత్రం అటువంటిదేమీ లేదని సమర్థించుకుంటోంది.

ఇవీ చదవండి:

Last Updated : Sep 23, 2022, 2:15 PM IST

ABOUT THE AUTHOR

...view details