తెలంగాణ

telangana

ETV Bharat / state

అప్పుల బాధతో కుటుంబం బలవన్మరణం - విశాఖ జిల్లా నేర వార్తలు

ఏపీ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ లో విషాదం చోటుచేసుకుంది. అశ్వినీ లాడ్జ్‌లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

four-commit-suicide-at-a-lodge-near-visakhapatnam-rtc-complex
కుటుంబాన్ని బలితీసుకున్న అప్పుల బాధ

By

Published : Sep 9, 2020, 10:57 PM IST

ఏపీ విశాఖ ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద అశ్వినీ లాడ్జ్‌లో నలుగురు కుటుంబ సభ్యులు ఆత్మహత్య చేసుకున్నారు. అశ్వినీలాడ్జ్‌ 106 గదిలో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్యకు పాల్పడ్డారు. మృతులు అప్పలరాజు-మానస దంపతులు, కుమార్తె కీర్తి (6), కుమారుడు స్వాత్విక్‌ (5). వీరు పెందుర్తి బంధువానిపాలెం వాసులుగా గుర్తించారు. అప్పుల సమస్యతోనే ఆత్మహత్యకు పాల్పడినట్లు లేఖలో వెల్లడించారు. అప్పలరాజు కుటుంబం మృతిపై బంధువులకు ద్వారక పోలీసులు సమాచారమిచ్చారు.

కుటుంబాన్ని బలితీసుకున్న అప్పుల బాధ

ABOUT THE AUTHOR

...view details