తెలంగాణ

telangana

ETV Bharat / state

వీర్​మారుతి వ్యాయామశాల పున:నిర్మాణ పనులకు శంకుస్థాపన - hyderabad latest news

నాంపల్లి నియోజకవర్గంలోని వీర్ మారుతి వ్యాయామశాల పునఃనిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి తలసాని శ్రీనివాస్​ యాదవ్​... వ్యాయామశాల నిర్మాణానికి అవసరమైన ఆర్థిక సాయం చేస్తామని హామీ ఇచ్చారు.

Veer Maruti vyayam shala
వీర్​మారుతి వ్యాయామశాల పున:నిర్మాణ పనులకు శంకుస్థాపన

By

Published : Sep 30, 2020, 2:05 PM IST

రాష్ట్ర ప్రభుత్వం క్రీడా రంగాన్ని అద్భుతంగా ప్రోత్సహిస్తోందని... క్రీడాకారులకు అన్ని వసతులు కల్పిస్తూ... వారు ఎదిగేందుకు సహకరిస్తోందని మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ కొనియాడారు. హైదరాబాద్‌ బోయగూడ కమాన్‌ వద్ద వీర్‌ మారుతి వ్యాయామశాల-దంగల్‌కు మంత్రి శంకుస్థాపన చేశారు.

ప్రభుత్వం తరఫున 30 లక్షల రూపాయలు అందిస్తున్నామని... నిర్మాణంలో మరిన్ని నిధులు అందించేందుకు సిద్ధమన్నారు. మరుగున పడుతున్న కుస్తీని కొనసాగిస్తున్న యువతను మంత్రి తలసాని అభినందించారు.

ఇదీ చూడండి:'మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తా'

ABOUT THE AUTHOR

...view details