తెలంగాణ

telangana

AP CM JAGAN: కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన

ఏపీ ముఖ్యమంత్రి జగన్(CM Jagan) కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఉదయం 10 గంటలకు కొండవీటి వాగు సమీపంలోని జీరో పాయింట్ వద్ద జగన్​ పైలాన్​ను ఆవిష్కరించనుండగా... మొత్తం రూ.150 కోట్ల వ్యయంతో విస్తరణ పనులు చేపట్టారు.

By

Published : Jun 30, 2021, 7:06 AM IST

Published : Jun 30, 2021, 7:06 AM IST

AP CM JAGAN
కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులు

ఆంధ్రప్రదేశ్​లోని కృష్ణా కరకట్ట రహదారి విస్తరణ పనులకు ముఖ్యమంత్రి జగన్(CM Jagan) నేడు శంకుస్థాపన చేయనున్నారు. ఉండవల్లిలోని కొండవీటి వాగు సమీపంలోని జీరో పాయింట్ వద్ద ఉదయం 10 గంటలకు ఏపీ సీఎం జగన్ పైలాన్ ఆవిష్కరించనున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పర్యవేక్షిస్తున్నారు.

కొండవీటి వాగు నుంచి రాయపూడి వరకు కరకట్ట రహదారి విస్తరణ పనులు చేపట్టనున్నారు. మొత్తం రూ. 150 కోట్ల వ్యయంతో కరకట్ట విస్తరణ పనులు చేపట్టాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. 15 కిలోమీటర్ల పొడవున, 10 మీటర్ల వెడల్పుతో రహదారి నిర్మాణం చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. ప్రస్తుతం 4-6 మీటర్ల వెడల్పుతో మాత్రమే ఉన్న కరకట్ట రహదారిపై రాకపోకలు జరుగుతున్నాయి. ఏపీ సచివాలయం, ఏపీ హైకోర్టు సహా రాజధాని ప్రాంతంలో రాకపోకలకు, వీఐపీల ప్రయాణానికి ఇరుకైన రహదారి కారణంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. కరకట్ట మార్గాన్ని విస్తరిస్తే రాకపోకలకు ఇబ్బందులు తప్పుతాయని ఆంధ్రప్రదేశ్​ ప్రభుత్వం భావిస్తోంది.

ఇదీచదవండి:KRISHNA BOARD: కేంద్రానికి లేఖలు రాసిన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు

ABOUT THE AUTHOR

...view details