తెలంగాణ

telangana

ETV Bharat / state

యూసుఫైన్​ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన - Hm On Namp Darga

నాంపల్లిలోని యూసుఫైన్ దర్గాను హోంమంత్రి  మహమూద్ అలీ సందర్శించారు. రూ.21 లక్షల నిధులతో నూతనంగా నిర్మించనున్న మరుగుదొడ్లు, వాజ్​ఖానలకు శంకుస్థాపన చేశారు.

యూసుఫైన్​ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

By

Published : Jun 30, 2019, 9:10 PM IST

హైదరాబాద్​ నాంపల్లిలోని యూసుఫైన్​ దర్గాలో హోమంత్రి మహమూద్​ అలీ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. అనంతరం దర్గాలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు. దర్గాకు వచ్చే భక్తుల సౌకర్యార్థం ఏర్పాటు చేయనున్న ఈ నిర్మాణాలు చాలా ఉపయోగకరంగా ఉంటాయని హోంమంత్రి అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో దర్గాలు పూర్వ వైభవం సంతరించుకుంటున్నాయని పేర్కొన్నారు. కేసీఆర్ తెలంగాణ ఉద్యమాన్ని ఈ దర్గా నుండే ప్రత్యేక ప్రార్థనలు చేసి ప్రారంభించారని ఇక్కడ అభివృద్ధి పనులు ప్రారంభించడం సంతోషంగా ఉందని స్థానికులు తెలిపారు. కార్యక్రమంలో వక్ఫ్ బోర్డ్ ఛైర్మన్ ఎమ్మెల్సీ సలీం, డిప్యూటీ మేయర్ బాబా ఫసియుద్దీన్ పాల్గొన్నారు.

యూసుఫైన్​ దర్గాలో అభివృద్ధి పనులకు శంకుస్థాపన

ABOUT THE AUTHOR

...view details