తెలంగాణ

telangana

ETV Bharat / state

FGG DEMAND: 'పంట సాగు చేసే వారికే రైతుబంధు అందించాలి' - తెలంగాణ వార్తలు

పంట సాగు చేసే వారికే రైతుబంధు(RYTHU BANDHU) అందించాలని సుపరిపాలనా వేదిక(FGG) కార్యదర్శి పద్మనాభ రెడ్డి అన్నారు. ఈ పథకంలో ఎటువంటి షరతులు లేకపోవడం వల్ల ప్రభుత్వ ధనం వృథా అవుతోందని తెలిపారు. షరతులతో కూడిన పథకం అమలు చేసేలా చూడాలని గవర్నర్‌ని కోరారు.

FGG letter to governor, fgg on rythu bandhu
రైతుబంధుపై సుపరిపాలనా వేదిక, గవర్నర్‌కు పద్మనాభ రెడ్డి లేఖ

By

Published : Aug 11, 2021, 11:40 AM IST

భూస్వాములు, ఆదాయ పన్ను చెల్లించే వాళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు రైతుబంధు(RYTHU BANDHU) అందించటం ద్వారా ప్రభుత్వ ధనం దుర్వినియోగం అవుతోందని సుపరిపాలనా వేదిక(FGG) కార్యదర్శి పద్మనాభ రెడ్డి అన్నారు. ఏటా రైతుబంధు పథకం కింద రూ.15వేల కోట్లను ప్రభుత్వం ఖర్చు చేస్తోందని తెలిపారు. పథకం ఉద్దేశం ఎంతో మంచిదైనప్పటికీ సింహభాగం డబ్బులు భూస్వాములకు, ఆదాయ పన్ను చెల్లించే వాళ్ల ఖాతాల్లోనే జమ అవుతున్నాయని పద్మనాభ రెడ్డి చెప్పారు. కేవలం పంట సాగు చేసే రైతులకే రైతుబంధు పథకం అందేలా మార్గదర్శకాలు రూపొందించాలని డిమాండ్ చేశారు.

కేంద్రం అందిస్తున్న కిసాన్ యోజన పథకంలో 5 ఎకరాలు పైబడిన రైతులకు, ప్రభుత్వ ఉద్యోగులకు, ఆదాయ పన్ను చెల్లించే వాళ్లకు డబ్బులు ఇవ్వటం లేదని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం షరతులతో కూడిన రైతుబంధు పథకం అమలు చేసేలా చూడాలని గవర్నర్‌కు(GOVERNOR) రాసిన లేఖలో పద్మనాభ రెడ్డి కోరారు.

ఇదీ చదవండి:ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్ర ప్రభుత్వం చేసిన అప్పు ఎంతో తెలుసా?

ABOUT THE AUTHOR

...view details