తెలంగాణ

telangana

ఊర్రూతలూగించే ఫార్ములా ఈ-రేసు.. ధ్వని తక్కువ.. దూకుడెక్కువ

By

Published : Feb 11, 2023, 8:49 AM IST

Updated : Feb 11, 2023, 9:01 AM IST

Formula E Racing in Hyderabad : ఊర్రూతలూగించే అంతర్జాతీయ ఫార్ములా ఈ- రేస్‌కు సమయం రానే వచ్చింది. హుస్సేన్‌సాగర్‌ తీరం ఈ పోటీలకు ఆతిథ్యం ఇవ్వనున్న దృష్ట్యా సకల ఏర్పాట్లు చేశారు. శనివారం అసలైన సమరం ప్రారంభం కానుండడంతో వారం రోజుల ముందు నుంచే నగరంలో హడావుడి ప్రారంభమైంది. శుక్రవారం ఉదయం నుంచే సర్క్యూట్‌లో సందడి వాతావరణం నెలకొంది.

Formula E Racing in Hyderabad
Formula E Racing in Hyderabad

Formula E Racing in Hyderabad : ఫార్ములా రేస్‌ అంటే.. గంటకు గరిష్ఠంగా 300 కిలోమీటర్లు పైనే దూసుకుపోతుంటాయి. ఆ వేగానికి తీవ్రమైన శబ్దం వెలువడుతుంటుంది. కానీ ఫార్ములా ఈ-రేస్‌లో వినియోగించేవి ఎలక్ట్రికల్‌ కార్లు కావడంతో ఆ వేగానికి టైర్ల నుంచి అతి తక్కువ శబ్దం మాత్రమే వెలువడనుంది.

Formula E Racing in Hyderabad Today : మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు డ్రైవర్లు కార్లతో రేస్‌లోకి దిగి సాధన చేశారు. శనివారం జరిగే పోటీలకు దేశ, విదేశాల నుంచి క్రికెట్‌, సినిమా తారలు ఇతర సెలబ్రెటీలు హాజరు కానున్నారు. పోటీలు జరిగే ప్రాంతానికి రావాలంటే పాస్‌ లేదంటే టిక్కెట్‌ తప్పనిసరి. అంతర్జాతీయ పోటీలు కావడంతో భద్రత పరంగా పోలీసులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. గ్యాలరీల్లోకి ప్రేక్షకులను విడిచిపెట్టే ముందు క్షుణ్నంగా తనిఖీలు చేస్తున్నారు.

అయితే సెల్‌ఫోన్లపై ఎలాంటి నిషేధం లేదు. శనివారం ఉదయ 8 గంటలకే ప్రీ ప్రాక్టీసు, తర్వాత క్వాలిఫయింగ్‌...అనంతరం 3 గంటల తర్వాత ప్రధాన రేస్‌కు డ్రైవర్లు రంగంలోకి దిగనున్నారు. దాదాపు గంటన్నర పాటు ఈ రేస్‌ సాగనుంది. ప్రేక్షకులు అతిథులకు సేవలందిం చేందుకు ఎంబీఏ చదువుతున్న విద్యార్థులను వాలంటీర్లుగా ఎంపిక చేశారు.

భారత మోటార్‌ స్పోర్ట్స్‌లో కొత్త అధ్యాయానికి హైదరాబాద్‌లో తెర లేవబోతోంది. ఫార్ములా వన్‌ తర్వాత ఎక్కువ ఆదరణ దక్కించుకుంటున్న ఫార్ములా-ఈ ప్రపంచ ఛాంపియన్‌షిప్‌కు హైదరాబాద్‌ ఆతిథ్యమిస్తోంది. ఇవాళ హుస్సేన్‌సాగర్‌ తీరంలోని ఎన్టీఆర్‌ మార్గ్‌ ఈ-కార్ల రేసుతో సందడిగా మారనుంది. భారత్‌లో జరగనున్న తొలి ఫార్ములా-ఈ రేసు ఇదే కావడం విశేషం.

మొత్తం 11 ప్రముఖ ఆటోమొబైల్‌ కంపెనీలకు చెందిన ఎలక్ట్రిక్‌ కార్లు పాల్గొనేపోటీలో. 22మంది రేసర్లు సత్తా చాటనున్నారు. రక్షణ చర్యల్లో భాగంగా స్ట్రీట్ సర్క్యూట్‌కి ఇరువైపులా పెద్ద ఎత్తున బారికేడ్లు, ప్రేక్షకుల గ్యాలరీలు ఏర్పాటు చేశారు. ఇవాళ ఉదయం 8 గంటల 40 నిమిషాల వరకు రెండో ప్రీ ప్రాక్టీస్‌ రేస్‌, ఉదయం 10 గంటల 40 నిమిషాలకు అర్హత పోటీలు, మధ్యాహ్నం 3 గంటలకు ప్రధాన రేస్‌ ఉంటుంది.

చాలా థ్రిల్‌గా ఉంది...: 'ఇలాంటి అంతర్జాతీయ ఈవెంట్‌కు వాలంటీర్‌గా ఎంపిక కావడం చాలా థ్రిల్లింగ్‌గా ఉంది. దాదాపు 40 మంది స్నేహితులం ఇక్కడ సేవలు అందించేందుకు వచ్చాం. పీపుల్స్‌ ప్లాజాలో ఏర్పాటు చేసిన ఫ్యాన్‌ విలేజ్‌లో విధులు అప్పగించారు.' - బి.నిహారిక, ఎంబీఏ, వాలంటీర్‌

కెరీర్‌లో ఉపయోగపడుతుంది.. 'తొలిసారి ఇలాంటి ఈవెంట్‌లో వాలంటీర్‌గా పాలుపంచుకుంటున్నాం. ఎంబీఏ విద్యార్థులకు ఇది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ సేవలు అందించినందుకు ఎక్స్‌పీరియన్స్‌ సర్టిఫికెట్లు ఇవ్వనున్నారు. భవిష్యత్తులో క్యాంపస్‌ సెలెక్షన్‌లో ఇవి ఉపయోగపడనున్నాయి. ఇక్కడ ప్రేక్షకులకు, ఈవెంట్ల నిర్వాహకులకు సేవలు అందించేందుకు సిద్ధంగా ఉన్నాం.' - ఎం.విశాలి, ఎంబీఏ, వాలంటీర్‌

Last Updated : Feb 11, 2023, 9:01 AM IST

ABOUT THE AUTHOR

...view details