తెలంగాణ

telangana

ETV Bharat / state

హైదరాబాద్​లో ఫార్ములా ఈ రేస్​.. ట్రయల్​ రన్​కు ట్రాక్​ సిద్ధం..! - హైదరాబాద్​లో నిర్వహించనున్న ఈ రేస్

Formula E race in Hyderabad City: ఫార్ములా ఈ రేస్​ ట్రయల్​ రన్​కు ట్రాక్ సిద్ధం చేస్తున్నారు. ఈనెల 19 నుంచి మూడు రోజుల పాటు లేదా నెలాఖరుకు ట్రయల్ రన్ చేయనున్నట్లు హెచ్​ఎండీఏ అధికారులు తెలిపారు. హైదరాబాద్​లో ఫార్ములా ఈ-రేస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనుంది.

Formula E race in Hyderabad City
ఫార్ములా ఈ రేస్

By

Published : Nov 8, 2022, 8:05 PM IST

Formula E race in Hyderabad City: హైదరాబాద్ నగరంలో జరగనున్న ఫార్ములా ఈ రేస్ ట్రయల్ రన్​కు ట్రాక్ సిద్దం చేస్తున్నారు. ఈ నెల 19 నుంచి మూడు రోజుల పాటు లేదా నెలాఖరుకు ట్రయల్ రన్ చేయనున్నట్లు హెచ్ఎండీఏ అధికారులు వెల్లడించారు. దీనికోసం ఎన్టీఆర్ మార్గ్ ప్రాంతంలో డివైడర్లను తొలగించి.. నూతన రోడ్డు వేస్తున్నారు. అక్కడున్న చెట్లను తొలగించి రీలొకేట్ చేస్తున్నారు. మొత్తం 2.8 కిలో మీటర్ల మేర ఈ-కార్ రేసింగ్ జరగనుంది.

ఐమాక్స్ పక్క నుంచి రేస్ ప్రారంభమై.. ఎన్టీఆర్ మార్గ్ మీదుగా.. లుంబిని పార్కు ముందు యూ టర్న్ తీసుకుని.. ఎన్టీఆర్ పార్కు లోపల వేసిన ట్రాక్, ఐమాక్స్ మీదుగా తిరిగి ఐమాక్స్ పక్కకు చేరుకుని ముగియనుంది. 50 వేల మంది వరకు కార్ రేస్ వీక్షించేలా ట్రాక్ పక్కన సీటింగ్ ఏర్పాట్లు చేస్తున్నారు. ట్రాక్ ఏర్పాటు కోసం మొత్తం 214 చెట్లను అటవీ శాఖ అనుమతితో హెచ్ఓఎండీఏ అధికారులు రీలోకేట్ చేశారు.ఈ 214 చెట్లను సంజీవయ్య పార్కుతో పాటు.. ఇతర పార్కుల్లో రీలొకేట్ చేశారు. హైదరాబాద్​లో ఫార్ములా ఈ-రేస్ వచ్చే ఏడాది ఫిబ్రవరి 11న జరగనుంది.

హైదరాబాద్​లో ఫార్ములా ఈ రేస్​.. ట్రయల్​ రన్​కు ట్రాక్​ సిద్ధం..!

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details