Formula E Race Cancelled in Hyderabad : హైదరాబాద్‌లో జరగాల్సిన ఫార్ములా-ఈ కార్ల రేస్ (Formula-E race) రద్దైంది. ఫిబ్రవరి 10న ఈ రేసింగ్ జరగాల్సి ఉండగా, రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు ఎఫ్‌ఐఏ ప్రకటించింది. అలాగే గత ప్రభుత్వం అక్టోబర్ 23న రేస్ నిర్వహణకు ఒప్పందం చేసుకుందని తెలిపింది. కానీ ఆ ఒప్పందాన్ని మున్సిపల్ శాఖ రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుందని పేర్కొంది. కానీ తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా ఒప్పందాన్ని ఉల్లంఘించిన మున్సిపల్ శాఖపై చట్టపరమైన చర్యల కోసం నోటీసులు జారీ చేయనున్నట్లు ఎఫ్‌ఐఏ వెల్లడించింది.
సక్సెస్‌ఫుల్‌గా ముగిసిన ఫార్ములా ఈ-రేస్.. విజేతలుగా నిలిచింది వీరే
E Race in Hyderabad :ప్రపంచవ్యాప్తంగా 13 దేశాల్లో జరిగే ఈ-రేస్ జనవరి 13 నుంచి ప్రారంభం కానుండగా, ఫిబ్రవరిలో హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. ఇందుకోసం గతేడాది ఇండియన్ రేస్ కోసం ఎన్టీఆర్ గార్డెన్ చుట్టూ 2.75 కిలోమీటర్ల మేర స్ట్రీట్ సర్క్యూట్‌ను సిద్ధం చేశారు. ప్రమోటర్ సంస్థతోపాటు హెచ్‌ఎండీఏ నిర్వహణ, ఏర్పాట్లను పర్యవేక్షించింది. గతేడాది జరిగిన ఫార్మూలా రేస్ వల్ల, హైదరాబాద్ ఇమేజ్ పెరగడంతోపాటు సుమారు రూ.700 కోట్ల పెట్టుబడులు వచ్చాయని నిర్వాహకులు తెలిపారు.
భాగ్యనగరంలో అర్ధాంతరంగా నిలిచిపోయిన ఇండియా కార్ రేసింగ్ లీగ్
పర్యావరణహితమైన ఈ-వెహికిల్స్ ప్రోత్సహించాలనే లక్ష్యం :పర్యావరణహితమైన ఈ-వెహికిల్స్ ప్రోత్సహించాలనే లక్ష్యంతో, అంతర్జాతీయ స్థాయిలో ఫార్మూలా రేసును హైదరాబాద్ వేదికగా నిర్వహిస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం పట్ల ఫెడరేషన్ ఇంటర్నేషనల్ ఆటోమొబైల్స్ తీవ్ర నిరాశను వ్యక్తం చేస్తూ, ఈ సీజన్ రేసును రద్దు చేసుకున్నట్లు ప్రకటించింది.
ఈ-రేస్ రద్దుపై కేటీఆర్ స్పందన :హైదరాబాద్‌లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించే ఈ-రేస్ రద్దుపై మాజీ మంత్రి, బీఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) స్పందించారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్ణయం నగర బ్రాండ్‌ను దెబ్బతీసేలా ఉందంటూ నిరాశ వ్యక్తం చేశారు. ప్రపంచంతోపాటు దేశంలోనే హైదరాబాద్ ఖ్యాతిని పెంచే దిశగా, గత కేసీఆర్ ప్రభుత్వం ఎంతో చొరవతో ఈ-రేస్ నిర్వహించేందుకు నిర్ణయం తీసుకుందని కేటీఆర్ తెలిపారు.
KTR Tweet on E Race Cancelled : పర్యావరణహిత వాహనాలు ఎంతో ఉపయోగకరమని, భవిష్యత్ అంతా ఈ-వెహికిల్స్‌దేనని కేటీఆర్ తెలిపారు. విద్యుత్ వాహనాలు వాడాలనే ఔత్సాహికులను హైదరాబాద్‌కు రప్పించేలా, గతేడాది ఈ పోటీలు నిర్వహించి వారం పాటు సదస్సు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. తద్వారా ప్రత్యేక అంకురాలను రాష్ట్రానికి తీసుకొచ్చి, పెట్టుబడులను ప్రొత్సహించామని తెలియజేశారు. సస్టైనబుల్ మొబిలిటీ సొల్యూషన్స్‌కు కేంద్రంగా రాష్ట్రాన్ని ప్రమోట్ చేసేందుకు, తాము తెలంగాణ మొబిలిటీ వ్యాలీని కూడా ప్రారంభించిన విషయాన్ని ఉటంకిస్తూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
హైదరాబాద్‌లో ఫార్ములా ఈ-రేసింగ్.. ప్రాక్టీస్ రేస్-1 షురూ
హైదరాబాద్‌లో మొదటి రోజు ముగిసిన కార్ రేసింగ్.. మళ్లీ అవే తప్పిదాలు!