తెలంగాణ

telangana

ETV Bharat / state

Petrol prices effect: పెట్రోలు సెగకు.. జట్కా కొనుక్కున్న రైతన్న

పెరుగుతున్న పెట్రో ధరలను తట్టుకొలేక అశ్వాన్ని తన వాహనంగా మార్చుకున్నాడు ఓ రైతు. ఎరువుల బస్తాలను పట్టణం నుంచి తీసురావటానికి.. ఈ వాహనాన్నే వాడుతున్నాడు. ప్రస్తుతం గుర్రపు దాణా ఖర్చు.. ఇంధన ఖర్చు కంటే తక్కువగా ఉందని అంటున్నాడు.

hoarse
hoarse

By

Published : Aug 17, 2021, 5:18 PM IST

పెట్రో మంట తట్టుకోలేక.. గుర్రపు బండీతో రైతన్న బతుకు పయనం!

రోజురోజుకూ పెరిగిపోతున్న పెట్రో ధరలను తట్టుకోలేక బైకుకు స్వస్తిపలికిన ఓ రైతన్న.. గుర్రం బండిపై తన పనులు చేసుకోవడం మొదలుపెట్టాడు. ఏపీలోని అనంతపురం జిల్లా కల్యాణదుర్గం మండలం మల్లికార్జున పల్లి గ్రామానికి చెందిన ఆంజనేయులు.. తన పొలానికి వెళ్లి రావడానికి.. 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న పట్టణం నుంచి ఎరువుల బస్తాలు తీసుకురావడానికి గుర్రపుబండిని వినియోగిస్తున్నాడు. చమురు​ ధరలు పెరగిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు చెప్పాడు.

''నాలుగైదు రోజుల పాటు బస్తాలను వాహనంపై తీసుకెళ్లాలంటే 300 నుంచి 400 రూపాయలు వెచ్చించాల్సి వస్తోంది. మోటార్ సైకిల్ పై తీసుకెళ్లడానికి వీలులేకుండా పోయింది. ఒక బస్తా తీసుకెళ్లినా.. ఖర్చు తడిసి మోపెడు అవుతోంది. తప్పని పరిస్థితుల్లో జట్కాని తయారు చేయించి గుర్రాన్ని కొన్నా. పెట్రోల్ ఖర్చులతో పోలిస్తే గుర్రపు దాణా ఖర్చులు కూడా తక్కువగా ఉన్నాయి'' - ఆంజనేయులు, రైతు

ఇదీ చూడండి:GUMMADI NARSAIAH: మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య కారు బోల్తా

ABOUT THE AUTHOR

...view details