తెలంగాణ

telangana

ETV Bharat / state

షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ అనుమానాస్పద మృతి - Hyderabad Latest News

సుజాత
సుజాత

By

Published : Sep 3, 2022, 11:30 AM IST

Updated : Sep 3, 2022, 2:24 PM IST

11:28 September 03

షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ అనుమానాస్పద మృతి

డబ్బుంటేనే సంతోషం ఉంటుందని కొందరు భావిస్తుంటారు. ఆ సంతోషాన్ని వెతుక్కుంటూ అడ్డదారులు తొక్కుతారు. అంతిమంగా అధర్మంగా సంపాదించిన ధనం సుఖాన్ని కాదు దుఖాఃన్నే మిగులుస్తుంది. ఇందుకు నిదర్శనమే షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ సుజాత కుటుంబం. అక్రమ సంపాదన పచ్చని కుటుంబాన్ని కబలించింది. ఓ అవినీతి కేసులో దొరికి పోయిన సుజాత కూడబెట్టిన సొమ్ము సర్కారు పాలుకాగా.. అవమానాలతో కుంగిపోయిన ఆమె భర్త మృత్యువు పాలయ్యారు. సస్పెన్షన్‌, కేసులు, భర్త ఆత్మహత్యతో అనారోగ్యానికి గురైన సుజాత.. తాజాగా గుండెపోటుతో తనువు చాలించింది.

అక్రమ సంపాదన ఓ కుటుంబాన్నే కబలించింది. అవినీతి కేసులో అరెస్టై.. కేసులు, సస్పెన్షన్లు, మానసిక వేదన, అనారోగ్యంతో షేక్‌పేట మాజీ తహసీల్దార్‌ సుజాత కుటుంబం చిన్నాభిన్నమైంది. రెండేళ్ల క్రితం బంజారాహిల్స్‌లోని ఓ స్థలం వ్యవహరంలో 15 లక్షల రూపాయలు లంచం తీసుకుంటూ షేక్​పేట ఆర్ఐ నాగార్జున పట్టుబడిన కేసులో తహసీల్దార్ సుజాత హస్తముందని అవినీతి నిరోధక శాఖ తేల్చింది. ఆమె ఇంట్లో అనిశా చేసిన సోదాల్లో భారీగా నగదు లభ్యమైంది. నగదు విషయంలో తహసీల్దార్ సుజాతను మూడ్రోజుల పాటు ఏసీబీ అధికారులు విచారించారు.

ఆమెతో పాటు భర్త అజయ్‌ను అవినీతి నిరోధక శాఖ అధికారులు ప్రశ్నించారు. భూముల విషయంలో తహసీల్దార్ ప్రమేయమున్నట్లు ప్రాథమిక నిర్ధరణ కావటంతో ఆమెను అరెస్ట్‌ చేసి జైలుకు పంపారు. ఈ వ్యవహారంలో అజయ్​ ఏసీబీ అధికారుల విచారణకు హాజరుకావాల్సిన రోజే ఆత్మహత్య చేసుకున్నారు. ఓ విశ్వవిద్యాలయంలో ఆచార్యుడిగా పనిచేసే అజయ్‌ అపార్ట్‌మెంట్‌పై నుంచి దూకి ప్రాణాలు తీసుకున్నారు.

భర్త ఆత్మహత్య, కేసులు, సస్పెన్షన్లతో సుజాత అనారోగ్యానికి గురయ్యారు. వారం క్రితం నిమ్స్‌లో చేరిన ఆమె తాజాగా గుండెపోటుతో ప్రాణాలు వదిలారు. ఉన్నత ఉద్యోగాలతో సంతోషంగా జీవిస్తున్నఆ కుటుంబాన్ని అవినీతి కేసు కబలించింది. అక్రమ సంపాదన, ఆదాయానికి మించిన ఆస్తులు చిచ్చురేపాయి. తద్వరా భార్యభర్తలిద్దరూ తనువు చాలించటం అక్రమార్కులకు కనువిప్పు.

ఇవీ చదవండి:షేక్​పేట తహసీల్దార్ ఇంట్లో ఏసీబీ సోదాలు

షేక్​పేట్​ ఘటనపై అనిశా విచారణ

'తన కుమార్తెకే కాంట్రాక్ట్​ ఇచ్చుకున్నారు.. లెఫ్టినెంట్​ గవర్నర్​ను తొలగించండి'

Last Updated : Sep 3, 2022, 2:24 PM IST

ABOUT THE AUTHOR

...view details