తెలంగాణ

telangana

ETV Bharat / state

ఏపీ నూతన గవర్నర్​గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​ నియామకం

ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​
ఆంధ్రప్రదేశ్​ గవర్నర్​గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​

By

Published : Feb 12, 2023, 10:16 AM IST

Updated : Feb 12, 2023, 10:37 AM IST

10:12 February 12

ఆంధ్రప్రదేశ్ కొత్త​ గవర్నర్​గా జస్టిస్​ అబ్దుల్​ నజీర్​

AP new governor: పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను కేంద్రం నియమించింది. ఆంధ్రప్రదేశ్‌ గవర్నర్‌గా జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌ నియమితులయ్యారు. గతంలో ఆయన సుప్రీంకోర్టు న్యాయమూర్తిగా పనిచేశారు. ఆయోధ్య తీర్పు ఇచ్చిన ఐదుగురు జడ్జిల బెంచ్‌లో ఆయన ఒకరు. మొత్తం 12 మంది గవర్నర్ల నియామకానికి రాష్ట్రపతి ఆమోద ముద్ర వేశారు. ఏపీ గవర్నర్‌గా ఉన్న బిశ్వభూషణ్‌ హరిచందన్‌ను ఛత్తీస్‌గఢ్‌ గవర్నర్‌గా నియమించారు.

ఏపీతో పాటు మరికొన్ని రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను రాష్ట్రపతి ముర్ము నియమించారు. మొత్తంగా 12 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతానికి కొత్త గవర్నర్లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. మహారాష్ట్ర కొత్త గవర్నర్​గా రమేశ్ బైస్​ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నియమించారు. మహారాష్ట్ర ప్రస్తుత గవర్నర్ భగత్ సింగ్ కోశ్యారీ చేసిన రాజీనామాను ఆమోదించారు. ఇప్పటివరకు ఝార్ఖండ్ గవర్నర్​గా రమేశ్ ఉన్నారు.

అరుణాచల్ ప్రదేశ్ గవర్నర్​గా లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్​, సిక్కిం గవర్నర్​గా లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య, ఝార్ఖండ్ గవర్నర్​గా సీపీ రాధాకృష్ణన్, అసోం గవర్నర్​గా గులాబ్ చంద్ కటారియా, హిమాచల్​ప్రదేశ్ గవర్నర్​గా శివ్ ప్రతాప్​లను నియమిస్తూ రాష్ట్రపతి భవన్ ప్రకటన విడుదల చేసింది. మరోవైపు, లద్దాఖ్ ఎల్​జీగా ఉన్న ఆర్​కే మాథుర్ రాజీనామాను ముర్ము ఆమోదించారు. అరుణాచల్​ ప్రదేశ్ గవర్నర్​గా ఉన్న బ్రిగేడియర్ బీడీ మిశ్రను ఆయన స్థానంలో రాష్ట్రపతి నియమించారు.

రాష్ట్రాల వారిగా కొత్తగా నియమితులయిన గవర్నర్స్ వివరాలు:

రాష్ట్రం కొత్త గవర్నర్
ఆంధ్రప్రదేశ్ జస్టిస్‌ అబ్దుల్‌ నజీర్‌
మహారాష్ట్ర రమేశ్ బైస్​
అరుణాచల్ ప్రదేశ్ లెఫ్టినెంట్ జనరల్ కైవాల్య త్రివిక్రమ్ పర్నాయక్
సిక్కిం లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య
ఝార్ఖండ్ సీపీ రాధాకృష్ణన్
అసోం గులాబ్ చంద్ కటారియా
హిమాచల్​ప్రదేశ్ శివ్ ప్రతాప్

ఇవీ చదవండి:

Last Updated : Feb 12, 2023, 10:37 AM IST

ABOUT THE AUTHOR

...view details