శాతవాహనులు, కాకతీయులు పాలించిన తెలంగాణ ఔన్నత్యాన్ని రజాకార్లకు తాకట్టు పెట్టేలాముఖ్యమంత్రి కేసీఆర్ వ్యవహరిస్తున్నారని.. సచివాలయం నమూనా అలాగే ఉందని రాష్ట్ర భాజపా ఆరోపించింది. ఈ విషయమై ముఖ్యమంత్రి కేసీఆర్కు భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ బహిరంగ లేఖ రాశారు. కేసీఆర్ అంతరంగిక వ్యక్తి అయిన ఒవైసీ మనసు గెలుచుకునేందుకే ముఖ్యమంత్రి ఈ నిర్మాణ శైలిని ప్రతిపాదించారని లేఖలో పేర్కొన్నారు.
'సచివాలయం కూల్చివేత నిర్ణయం సరైంది కాదు' - ముఖ్యమంత్రి కేసీఆర్కు కె.లక్ష్మణ్ లేఖ
రాష్ట్రంలో కరోనా ఉగ్రరూపం దాల్చుతున్న సమయంలో.. సచివాలయ కూల్చివేత నిర్ణయం సరైంది కాదని భాజపా రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కె.లక్ష్మణ్ అభిప్రాయపడ్డారు. ఈ మేరకు ఆయన ముఖ్యమంత్రి కేసీఆర్కు బహిరంగ లేఖ రాశారు.
'సచివాలయ కూల్చివేత నిర్ణయం సరైంది కాదు'
దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా ప్రజాధనాన్ని ముఖ్యమంత్రి దుర్వినియోగం చేస్తున్నారని విమర్శించారు. మరో నలభై ఏళ్ల వరకు సచివాలయం కూల్చే అవసరం లేకున్నా గొప్పల కోసం కొత్త సచివాలయం కట్టాలన్న సీఎం నిర్ణయం సరైంది కాదన్నారు.
ఇదీ చూడండి:సచివాలయ భవనాల కూల్చివేత పనులపై హైకోర్టు స్టే
Last Updated : Jul 10, 2020, 3:34 PM IST