మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ 30వ వర్ధంతి సందర్బంగా సోమాజిగూడలో రాజీవ్ గాంధీ విగ్రహానికి పలువురు కాంగ్రెస్ నేతలు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. మల్కాజిగిరి ఎంపీ రేవంత్ రెడ్డి, మాజీ పీసీసీ అధ్యక్షుడు వి.హనుమంతురావు, మాజీ ఎమ్మెల్సీ రాములునాయక్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. గాంధీభవన్లోనూ పలువురు నాయకులు రాజీవ్ గాంధీ చిత్రపటానికి నివాళులు అర్పించారు.
'సంక్షేమ అభివృద్ధికి రాజీవ్‌గాంధీ ఎంతగానో కృషి చేశారు' - మాజీ ప్రధాని రాజీవ్ గాంధీ వర్ధంతి
సంక్షేమం, అభివృద్ది కోసం రాజీవ్‌గాంధీ కృషిచేశారని కాంగ్రెస్ నేతలు పేర్కొన్నారు. స్వర్గీయ రాజీవ్ గాంధీ వర్ధంతి సందర్భంగా ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు సేవా కార్యక్రమాలు చేపట్టారు.
ఐటీ రంగాన్ని దేశానికి పరిచయం చేసి.. విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఘనత రాజీవ్ గాంధీకే దక్కుతుందని వక్తలు పేర్కొన్నారు. దేశ సంక్షేమం కోసం, అభివృద్ది కోసం చివరి రక్తపు బొట్టు వరకు కృషి చేశారని కొనియాడారు. గ్రామాల అభివృద్ధికి, సంక్షేమం, అభివృద్ధి కోసం ఎంతగానో కృషి చేశారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ శ్రేణులు వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టారు. కరోనా వ్యాప్తి కట్టడిలో భాగంగా మాస్కులు, శానిటైజర్లు అందించారు.
ఇదీ చూడండి:పదో రోజు పకడ్బందీగా ఆంక్షలు.. ఉల్లంఘించిన వారిపై చర్యలు