మాజీ ప్రధాని పీవీ నరసింహరావు శతజయంతి ఉత్సవాల((PV Narasimha Rao Centenary Celebrations))ను ఏడాది పాటు రాష్ట్రంతో పాటు ఇతర దేశాల్లో... ప్రభుత్వంతో పాటు ఇతర సంస్థలు ఘనంగా నిర్వహించాయి. ఈ ఉత్సవాలు నేటితో ముగియనున్న నేపథ్యంలో పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ముగింపు వేడుకలు జరిపారు.
నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఆవిష్కరణ - తెలంగాణలో పీవీ కాంస్య విగ్రహం
పీవీ శతజయంతి ఉత్సవాలు(PV Narasimha Rao Centenary Celebrations) నేటితో ముగియనున్న నేపథ్యంలో... పీవీ మార్గ్‌లోని జ్ఞానభూమిలో ముగింపు ఉత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి గవర్నర్ తమిళి సై(Governor Tamilisai), ముఖ్యమంత్రి కేసీఆర్(CM KCR) హాజరై... 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని ఆవిష్కరించారు.
నెక్లెస్ రోడ్‌లో 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహం ఏర్పాటు
ఈ కార్యక్రమంలో గవర్నర్ తమిళి సై(Governor Tamilisai), సీఎం కేసీఆర్(CM KCR) పాల్గొన్నారు. పీవీ మార్గ్(PV Marg)ను ప్రారంభించారు. నెక్లెస్ రోడ్‌లో ఏర్పాటు చేసిన 26 అడుగుల పీవీ కాంస్య విగ్రహాన్ని గవర్నర్, ముఖ్యమంత్రి కలిసి ఆవిష్కరించారు. అనంతరం పీవీ విగ్రహానికి నివాళులు అర్పించారు.
ఇదీ చూడండి: 'పీవీ.. తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు'