రాష్ట్రంలో కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉందని మాజీ ఎంపీ మల్లురవి పేర్కొన్నారు. హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆరోగ్య కమిటీలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వానికి సూచించారు. అన్ని జిల్లాల్లోని కలెక్టరేట్‌ల పరిధిలో కలెక్టర్, ఎస్పీ, జిల్లా వైద్యాధికారితో ఇదే రకమైన కమిటీలు ఏర్పాటు చేయాలన్నారు.
'రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి ఆరోగ్య కమిటీలు వేయాలి' - తెలంగాణ తాజా వార్తలు
కొవిడ్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నందున హైదరాబాద్ పోలీస్ కమిషనరేట్ల పరిధిలో ఆరోగ్య కమిటీలు వేయాలని ప్రభుత్వాన్ని మాజీ ఎంపీ మల్లు రవి విజ్ఞప్తి చేశారు. ఐఏఎస్, ఐపీఎస్, వైద్య అధికారులతో కమిటీలు వేసి... ప్రజలకు టోల్ ఫ్రీ నంబర్‌తో సందేహాలు నివృత్తి చేయాలని అన్నారు.
!['రాష్ట్రంలో కొవిడ్ కట్టడికి ఆరోగ్య కమిటీలు వేయాలి' mallu ravi on corona](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-09:20:17:1619193017-11515483-mallu-ravi.jpg)
telangana news
ఈ కమిటీల ద్వారా అత్యవసర మందులు, ఆక్సిజన్, వెంటిలేటర్లు, టీకాలు…. అవసరమైన వారికి అందేవిధంగా చూడాలన్నారు. ప్రైవేటు, ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగులకు... వైద్య సేవలు అందుబాటులో ఉండే విధంగా ఈ కమిటీలు చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్ త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు.
ఇదీ చూడండి:కొవిడ్ నుంచి కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదే : తలసాని