మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నాయకత్వం మారితే తెరాసలో చేరే అవకాశం ఉందన్నారు. వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలవాలని సమయం కోరినట్లు తెలిపారు. ఈటల రాజేందర్, హరీశ్ అంటే తనకు అభిమానమని పేర్కొన్నారు.
నాయకత్వం మారితే తెరాసలో చేరుతా: కొండా విశ్వేశ్వర్ రెడ్డి - మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తాజా వార్తలు
వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్‌ను కలవాలని సమయం కోరినట్లు మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి తెలిపారు. నాయకత్వం మారితే తెరాసలో చేరే అవకాశం ఉందన్నారు.
కొండా విశ్వేశ్వర్ రెడ్డి
ఈటల బయటకు వస్తా అంటున్నారని... కానీ రావడం లేదు.. కావాలనే ఇలా డ్రామా జరుగుతోందా లేక నిజంగానే జరుగుతోందా అన్న విషయం తెలుసుకోడానికే తాను సమయం కోరినట్లు వివరించారు. హరీశ్ రావు ప్రజల మనిషి అని.. ఎక్కువగా మాట్లాడరని, ఎక్కువగా వింటారని అన్నారు. రాష్ట్రంలో పార్టీలు ఎక్కువై.. ఓట్లు చీలిపోతే.. తనకు మేలు జరుగుతుందని కేసీఆర్ అంచనా వేస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి:ప్రారంభమైన మల్లన్న జాతర.. బోనాలు సమర్పించిన గ్రామస్థులు
Last Updated : Mar 28, 2021, 9:06 PM IST