విద్యార్థులకు ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు సికింద్రాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ సెకండరీ పాఠశాలకు మాజీ ఎంపీ, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత తొమ్మిది కంప్యూటర్లను అందించారు. సుమారు 27 ఏళ్లుగా సెయింట్ జోసెఫ్ పాఠశాల నిర్వహిస్తున్న 77 ఏళ్ల బైలా గాబ్రియల్... కరోనా వల్ల పిల్లల చదువులు ఆగిపోకూడదని.. వారికి ఆన్లైన్ పాఠాలు బోధించేందుకు దాతలు సహకరించాలని ట్విటర్లో పేర్కొన్నారు.
ఆన్లైన్ బోధన కోసం 9 కంప్యూటర్లు పంపిణీ చేసిన కవిత
సికింద్రాబాద్‌లోని సెయింట్ జోసెఫ్ సెకండరీ పాఠశాలకు మాజీ ఎంపీ కవిత.. తెలంగాణ జాగృతి తరపున 9 కంప్యూటర్లను అందజేశారు. పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కవిత ట్వీట్ చేశారు.
ఆన్లైన్ బోధన కోసం 9 కంప్యూటర్లు పంపిణీ చేసిన కవిత
ఆ ట్వీట్‌కు స్పందించిన కవిత.. తెలంగాణ జాగృతి తరపున 9 కంప్యూటర్లను ఇచ్చారు. కవితకు పాఠశాల నిర్వాహకులు కృతజ్ఞతలు తెలిపారు. పేద పిల్లలకు ఉచిత విద్యను అందిస్తున్న బైలా గాబ్రియల్‌ను కవిత ప్రత్యేకంగా అభినందించారు. సెయింట్ జోసెఫ్ స్కూల్‌కు భవిష్యత్తులో మరింత సహాయం చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నట్లు కవిత ట్వీట్ చేశారు.
ఇవీచూడండి:ఈఎస్ఐ కేసు: దేవికారాణితోపాటు మరో ఎనిమిది మంది అరెస్ట్