తెలంగాణ

telangana

ETV Bharat / state

Jitender Reddy latest comments : 'బండి సంజయ్​ను మారుస్తున్నట్లు దుష్ప్రచారం చేయిస్తున్నారు' - బీజేపీ లీడర్​ జితేందర్​ రెడ్డి

BJP leader Jitender Reddy latest comments : పదవులు ఇచ్చే ముందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదని ఆ పార్టీ కార్యవర్గ సభ్యుడు జితేందర్‌రెడ్డి స్పష్టం చేశారు. బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదన్న ఆయన.. పార్టీ అధ్యక్షుడిని మారుస్తున్నట్లు దుష్ప్రచారం చేయిస్తున్నారని తప్పుబట్టారు. హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు గార్డెన్‌లో పార్టీలోని పలువురు సీనియర్‌ నేతలు అంతా సమావేశమై వివిధ అంశాలపై చర్చించారు.

Jitender Reddy
Jitender Reddy

By

Published : Jun 11, 2023, 10:37 PM IST

Telangana BJP Latest News : తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసి బీజేపీలో చేరిన నేతలు అంతరంగిక సమావేశం అయ్యారు. హైదరాబాద్‌లో మాజీ ఎంపీ జితేందర్‌ రెడ్డి నివాసంలో జరిగిన ఈ అంతర్గత సమావేశానికి విజయశాంతి, వివేక్‌ వెంకట స్వామి, కొండా విశ్వేశ్వరరెడ్డి, బూర నర్సయ్య గౌడ్‌, విఠల్‌, రవీంద్ర నాయక్‌, దేవయ్య హాజరయ్యారు. ఈ సమావేశంలో బీజేపీలో జరుగుతున్న తాజా పరిణామాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఈ సందర్భంగా ఈటల రాజేందర్​కు ప్రచార కమిటీ ఛైర్మన్ పదవి అంటూ జరుగుతున్న ప్రచారంపై నేతలు అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.

పార్టీ అధ్యక్షుడు హైదరాబాద్​లో ఉండగా.. దిల్లీ వెళ్లి లీకులు ఇవ్వాల్సిన అవసరం ఏముందని చర్చించుకున్నారు. జాతీయ కార్యవర్గ సభ్యులుగా ఉన్న నాయకులకు పార్టీలో జరుగుతున్న పరిణామాలు తెలియడం లేదని సమావేశంలో ఆందోళన వ్యక్తం చేసినట్లు విశ్వసనీయ సమాచారం. సమావేశం అనంతరం జితేందర్​ రెడ్డి స్పందించారు. కేవలం మర్యాదపూర్వకంగానే తామంతా సమావేశమయ్యామని పేర్కొన్నారు. తమకు ఎలాంటి రహస్య ఎజెండా లేదని స్పష్టం చేశారు.

"కావాలనే సీఎం కేసీఆర్ మీడియాలో లీకులు ఇస్తున్నారు. బీజేపీ పార్టీకి వస్తున్న ఆదరణను చూసి ఇలా తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. గ్రామ, మండల స్థాయిలో తమ పార్టీ కేడర్ పని చేయకుండా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారు. అసలు బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదు. రాష్ట్ర నేతలతో చర్చించకుండా జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదు"-జితేందర్‌ రెడ్డి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు

మాజీ ఎంపీ జితేందర్​ రెడ్డి

పదవులు ఇచ్చే మందు లీకులు ఇచ్చే సంస్కృతి బీజేపీలో లేదని జితేందర్​ రెడ్డి అన్నారు. అసలు బీజేపీలో ప్రచార కమిటీ పదవి లేదని కొట్టిపారేశారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మారుస్తున్నారని కేసీఆర్​ లీకులు ఇస్తున్నారని ఆరోపించారు. బీజేపీ బలం తగ్గిందని చెప్పడానికే కాంగ్రెస్​పై మాట్లాడుతున్నారని విమర్శించారు. గ్రామీణ స్థాయి నుంచి తమ పార్టీ కేడర్ పని చేయకుండా కన్ఫ్యూజ్ చేయడానికి ఇలాంటి దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రాష్ట్ర నేతలతో చర్చించకుండా జాతీయ నాయకత్వం ఎటువంటి నిర్ణయం తీసుకోదని తేల్చి చెప్పారు.

"బీజేపీ తెలంగాణ అధ్యక్ష పదవి మార్పుపై మీడియా లీకేజీలు సరి కాదు. బీజేపీలో వార్తలు లీక్ చేసే పద్ధతి ఉండదు. సార్వత్రిక ఎన్నికలు పూర్తి అయ్యే వరకూ బండి సంజయ్ కొనసాగుతారని తరుణ్ చుగ్ గతంలోనే చెప్పారు. నేతల భేటీలపై ఊహాగానాలతో వెలువడే మీడియా కథనాలు, సమాచారం ఎప్పటికీ అధికార ప్రకటనలు కావు. వీటి ప్రభావం పార్టీపైనా, ప్రజల్లోనూ ఉండదు. పార్టీ అధికార ప్రతినిధుల నుంచి మాత్రమే కచ్చితమైన సమాచారం లేదా ప్రకటన వస్తుంది."-విజయశాంతి, బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యురాలు

ఇవీ చదవండి:

ABOUT THE AUTHOR

...view details