వేసవిలో ఏర్పాటు చేసే తాగునీటి శిబిరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని భువనగిరి మాజీ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ పేర్కొన్నారు. కరోనా వైరస్ దృష్ట్యా వాడిపారేసే గ్లాసులతోనే నీటిని తాగాలని ఆయన సూచించారు.
'తాగునీటి శిబిరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి' - ఖైరతాబాద్‌లో చలివేంద్రం ప్రారంభం
హైదరాబాద్ ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని మాజీ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ ప్రారంభించారు. కరోనా వైరస్ దృష్ట్యా వాడిపారేసే గ్లాసులతోనే నీటిని తాగాలని ఆయన సూచించారు.
'తాగునీటి శిబిరాలతో ప్రజలు అప్రమత్తంగా ఉండాలి'
హైదరాబాద్ ఖైరతాబాద్ ఆనంద్‌నగర్ కాలనీలో ప్రముఖ ప్రొఫెసర్ నారాయణ గౌరవార్థం ఆయన కుటుంబసభ్యులు ఏర్పాటు చేసిన చలివేంద్రాన్ని నర్సయ్యగౌడ్ ప్రారంభించారు. వేసవి దృష్ట్యా తాగునీటి చలివేంద్రాన్ని ముందస్తుగానే ఏర్పాటు చేయడం పట్ల నారాయణ కుటుంబ సభ్యులను నర్సయ్యగౌడ్ అభినందించారు. కరోనా వైరస్ పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని విజ్ఞప్తి చేశారు.
- ఇదీ చూడండి :సీఏఏకి వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం