తెలంగాణ

telangana

ETV Bharat / state

కేసీఆర్​ నిర్ణయాలతో రైతులు నష్టపోతున్నారు: వివేక్​

ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్‌ వెంకటస్వామి విమర్శించారు. సన్న రకం వడ్లను క్వింటాకు రూ.2500 చొప్పున కొనుగోలు చేయాలని డిమాడ్​ చేశారు.

former mp, bjp leader vivekvenkataswamy fire on cm kcr in hyderabad
కేసీఆర్​ తుగ్లక్​ పాలనతో రైతులు నష్టపోతున్నారు: వివేక్​

By

Published : Nov 6, 2020, 3:48 PM IST

భాజపా నేత, మాజీ ఎంపీ వివేక్​ వెంకటస్వామి సీఎం కేసీఆర్​పై విమర్శలు గుప్పించారు. కేసీఆర్‌ తీసుకున్న నిర్ణయాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆరోపించారు. సన్న రకం వడ్లను క్వింటాకు రూ.2500 చొప్పున కొనుగోలు చేయాలని డిమాడ్​ చేశారు. మొక్కజొన్న రైతులు ఏవిధంగా అయితే కేసీఆర్‌ మెడలు వంచి కొనుగోలు చేయించామో అదే విధంగా సన్న రకం వడ్లను కొనుగోలు చేయిస్తామన్నారు.

సన్న రకం వరి సాగు చేయమన్న సీఎం మద్దతు ధర ఎందుకు చెల్లించడం లేదని ప్రశ్నించారు. సన్న రకం వరి తెగుళ్ల బారిన పడి రైతులు నష్టపోయారని.. వచ్చిన కాస్త దిగుబడికి ప్రభుత్వం మద్దతు ధర చెల్లించడం లేదన్నారు. దొడ్డు వడ్లకు రూ.1868 చెల్లిస్తుండగా.. సన్న రకానికి రూ.1888 ఇస్తున్నారని చెప్పారు. కేవలం రూ. 20 మాత్రమే ఎక్కువగా చెల్లిస్తున్నారని పేర్కొన్నారు.

ఇదీ చదవండి:లిఫ్టులో ఇరుక్కున్న మంత్రి... 20 నిమిషాలు నరకం

ABOUT THE AUTHOR

...view details