ఎమ్మెల్సీ కవితను ప్రసన్నం చేసుకునేందుకే కాంగ్రెస్ నేతలు పార్లమెంట్లో పసుపు బోర్డు అంశం లేవనెత్తారని మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ అన్నారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం, షర్మిలతో కలిసి లోపాయకారి ఒప్పందం చేకుకున్నాయని ఆరోపించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి పసుపు బోర్డును ఎందుకు తేలేదని ప్రశ్నించారు. డీఎస్ చెప్పినా వైఎస్ వినలేదని.. ఈ విషయం షర్మిలకు తెలియదా అని అన్నారు.
కేసీఆర్ కనుసన్నల్లో కాంగ్రెస్: ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ - ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ తాజా వార్తలు
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ కేసీఆర్ కనుసన్నల్లో నడుస్తోందని భాజపా మాజీ ఎమ్మెల్యే ఎన్వీఎస్ఎస్ ప్రభాకర్ ఆరోపించారు. తెరాస, కాంగ్రెస్, ఎంఐఎం, షర్మిలతో కలిసి లోపాయకారి ఒప్పందం కుదుర్చుకున్నాయని చెప్పారు.
షర్మిల సభకు అనుమతి ఇచ్చినందుకు కవితకు సాయం చేసేందుకే షర్మిల పసుపు బోర్డు అంటోందని చెప్పారు. నాగార్జునసాగర్ ఉప ఎన్నికల్లో జానారెడ్డిని గెలిపించుకునేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలలో చిన్నారెడ్డి, రాములు నాయక్‌ను బలిపశువులను చేశారని పేర్కొన్నారు. రైతులు.. పసుపు బోర్డే కావాలంటే కేంద్రంతో తాను మాట్లాడుతానని ప్రభాకర్ తెలిపారు. స్పైస్ రీజనల్ ఎక్స్ టెన్షన్ బోర్డ్‌తో పసుపునకు మంచి ధర వస్తుందని చెప్పారు. పీవీ కూతురును అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో గెలిచారని.. వచ్చే ఎన్నికల్లో వైఎస్ కూతురుని అడ్డం పెట్టుకుని గెలవాలని చూస్తున్నారని చెప్పారు.
ఇదీ చదవండి:కాంగ్రెస్ బలమైన ప్రతిపక్షంగా ఉండలేకపోతోంది: కొండా విశ్వేశ్వర్ రెడ్డి