రాష్ట్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై కాంగ్రెస్ పోరాటం చేయకపోవడంతోనే దుబ్బాక, గ్రేటర్ ఎన్నికల్లో ప్రజలు భాజపాకు పట్టం కట్టారని మాజీ ఎమ్మెల్యే, భాజపా నేత కూన శ్రీశైలం గౌడ్ తెలిపారు. కాంగ్రెస్ పార్టీలో పోరాడిన ముందుకు వెళ్లలేని పరిస్థితి ఉందన్నారు. గత 30 ఏళ్లుగా కాంగ్రెస్‌లోనే ఉన్నా తనకు టికెట్ ఇవ్వకపోయినా.. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసి గెలిచానని తెలిపారు. ఆయన దిల్లీలో భాజపా జాతీయాధ్యక్షుడు నడ్డా సమక్షంలో కాషాయ కండువా కప్పుకున్న తరువాత తొలిసారిగా పార్టీ రాష్ట్ర కార్యాలయానికి వచ్చి అధ్యక్షుడు బండి సంజయ్‌ని కలిశారు.
కాంగ్రెస్ పోరాటం చేయలేకపోతోంది: శ్రీశైలం గౌడ్ - కూన శ్రీశైలం గౌడ్ వార్తలు
భాజపాలో చేరిన తర్వాత తొలిసారిగా ఆ పార్టీ కార్యాలయానికి మాజీ ఎమ్మెల్యే కూన శ్రీశైలం గౌడ్ వచ్చారు. ఆయనను బండి సంజయ్, పార్టీ శ్రేణులు సాదరంగా ఆహ్వానించారు.
![కాంగ్రెస్ పోరాటం చేయలేకపోతోంది: శ్రీశైలం గౌడ్ former mla kuna srishailam goud press meet in hyderabad](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10769610-thumbnail-3x2-kuna.jpg)
కాంగ్రెస్ పోరాటం చేయలేకపోతోంది: శ్రీశైలం గౌడ్
కూన శ్రీశైలం గౌడ్‌ను బండి సంజయ్, పార్టీ శ్రేణులు సాదరంగా ఆహ్వానించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఎవరెవరినో తీసుకువచ్చి ఎమ్మెల్సీ చేస్తున్నాడని.. అదే తరహాలో పీవీ కూతురును కూడా గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీ చేయవచ్చు కదా అని ప్రశ్నించారు. తెరాసకు అభ్యర్థులను లేకనే పీవీ బిడ్డను బరిలో నిలిపారని ఎద్దేవా చేశారు. భాజపా అభ్యర్థి రాంచందర్‌రావు గెలుపు కోసం పని చేస్తానని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి:కరోనా బులెటిన్ రోజూ విడుదల చేయాలి: హైకోర్టు