సాంకేతిక కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బందిని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి కోరారు. లాక్ డౌన్ వల్ల.. తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వెల్లడించారు. ఏఐసీటీఈ పొందుపర్చిన నిబంధనల ప్రకారం జీతాలు చెల్లించాలన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి కేసీఆర్‌కు లేఖ రాశారు.
"ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి" - Former MLA AICC Secretary Vamsichand Reddy's letter to CM KCR
లాక్ డౌన్ కారణంగా.. సాంకేతిక కళాశాలల్లో పనిచేసే బోధన, బోధనేతర సిబ్బంది అవస్థలపై సీఎం కేసీఆర్‌కు మాజీ ఎమ్మెల్యే, ఏఐసీసీ కార్యదర్శి వంశీచంద్ రెడ్డి లేఖ రాశారు. 2018-19, 2019-20 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని కోరారు.
!["ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి" Former MLA AICC Secretary Vamsichand Reddy's letter to CM KCR](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-7231207-276-7231207-1589719524982.jpg)
"ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించండి"
ప్రభుత్వం వెంటనే 2018-19, 2019-20 విద్యా సంవత్సరానికి ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులకు గ్రూప్ ఆక్సిడెంట్ పాలసీని అమలు చేయాలని వంశీచంద్ రెడ్డి అన్నారు. నిబంధనల ప్రకారం మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవులు ఎక్కడా అమలు కావడంలేదని పేర్కొన్నారు. అధ్యాపకులకు ప్రతి నెలా జీతాలు చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.