Vatti Vasanth Kumar : ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. విశాఖ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. వట్టి వసంత్‌కుమార్ స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని పశ్చిమ గోదావరి జిల్లా పూళ్ల గ్రామం. ఉంగుటూరు నుంచి 2004, 2009లో ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణాభివృద్ధి, పర్యాటకశాఖ మంత్రిగా కూడా పని చేశారు. వట్టి వసంత్‌కుమార్ భౌతికకాయాన్ని స్వగ్రామం తరలించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్ కన్నుమూత - ap maji mantri vasdanth kumar died
Vatti Vasanth Kumar : ఏపీ మాజీ మంత్రి వసంత్‌కుమార్ ఆదివారం ఉదయం కన్నుమూశారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు.
ఏపీ మాజీ మంత్రి వట్టి వసంత్‌కుమార్