కొండపోచమ్మ నుంచి ముఖ్యమంత్రి కేసీఆర్ విడుదల చేసిన నీరు.. ఎల్లంపల్లివా..? కాళేశ్వరానివా..? చెప్పాలని నీటిపారుదల శాఖ మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య డిమాండ్ చేశారు. కొండపోచమ్మ నుంచి విడుదల చేసిన నీళ్లు ఎల్లంపల్లి జలాలేనన్నారు.
'హల్దీవాగుకు విడుదల చేసిన నీళ్లు... ఎల్లంపల్లివా? కాళేశ్వరానివా?' - నీటి విడుదల
హల్దీవాగుకు నీటి విడుదలపై మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య విమర్శలు చేశారు. విడుదల చేసిన నీళ్లు ఎల్లంపల్లివా? కాళేశ్వరానివా అంటూ ప్రశ్నించారు. ఎల్లంపల్లి నీటిని తమ ఘనతగా చెప్పుకుంటున్నారని మండిపడ్డారు.
'హల్దీవాగుకు విడుదల చేసిన నీళ్లు... ఎల్లంపల్లివా? కాళేశ్వరానివా?'
కాంగ్రెస్ హయాంలో చేపట్టిన ప్రాజెక్టులను.. కాళేశ్వరం నీళ్లంటూ గొప్పలు చెప్పుకుంటున్నారని పొన్నాల విమర్శించారు. ప్రాణహిత-చేవెళ్ల పథకాన్ని కేవలం 38 వేల5 వందల కోట్ల రూపాయలతో రూపొందించామని తెలిపారు. 7 జిల్లాలకు సాగు నీరు.. హైదరాబాద్‌తోపాటు వందలాది గ్రామాలకు తాగునీరందించే లక్ష్యంతో చేపట్టిన ప్రాణహిత ప్రాజెక్టును కాళేశ్వరం పేరుతో ప్రజాధనం దుర్వనియోగం చేశారని పొన్నాల ఆరోపించారు.
ఇదీ చూడండి:మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...