ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అక్రమంగా నిర్మిస్తున్న రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని, పోతిరెడ్డిపాడు విస్తరణ పనులను ఆపేందుకు సుప్రీంకోర్టులో పిటిషన్ వేయాలంటూ సీఎం కేసీఆర్‌కు మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి (Former Minister Nagam Janardhan Reddy) సోమవారం లేఖ రాశారు. ఏపీ ప్రభుత్వం అక్రమంగా కృష్ణా బేసిన్ నుంచి నీటిని పెన్నా బేసిన్‌కు, ఇతర ప్రాంతాలకు తరలిస్తోందని.. ఈ చర్యలను తక్షణమే అడ్డుకోవాలని లేఖలో పేర్కొన్నారు.
Nagam Janardhan Reddy: 'ఆ పనులు ఆపేందుకు సుప్రీంలో పిటిషన్ వేయండి' - రాయలసీమ ఎత్తిపోతల పథకం
06:54 October 12
NAGAM
రాయలసీమ ఎత్తిపోతల పథకం(సంగమేశ్వరం) నిర్మాణం అంతర్జాతీయ న్యాయ సూత్రాలకు, జాతీయ జల విధానానికి పూర్తి విరుద్ధమని తెలిపారు. ఈ పోతిరెడ్డిపాడు విస్తరణ పనులు, రాయలసీమ ఎత్తిపోతల పథకం... తెలంగాణ సాగునీటి రంగానికి గొడ్డలిపెట్టు లాంటిదని వెల్లడించారు. ఈ పనులకు టెండర్లు దాఖలు చేసే ప్రతీ కాంట్రాక్టరుని తెలంగాణలో బ్లాక్ లిస్ట్ చేయడమేగాక... గతంలో కేటాయించిన పనులన్నీ రద్దు చేయాలని డిమాండ్ చేశారు.పోతిరెడ్డి పాడు వల్ల దక్షిణ తెలంగాణ ఎడారిగా మారుతుందని పేర్కొన్నారు.
ఇదీ చూడండి:'ఎత్తిపోతల పథకాన్ని అడ్డుకోవడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధిలేదు'