తెలంగాణ

telangana

ETV Bharat / state

MYSURA REDDY: చర్చించుకునేందుకు భేషజాలెందుకు?

కేంద్రం కేజీఆర్​ఎంబీ పరిధిని నిర్దేశిస్తూ ఇచ్చిన ఉత్తర్వులపై మాజీమంత్రి మైసూరారెడ్డి అసంతృప్తి వ్యక్తం చేశారు. కేంద్రం వైఖరితో గ్రేటర్​ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు అంటూ వ్యాఖ్యానించారు.

By

Published : Jul 21, 2021, 6:42 PM IST

former minister mysura reddy
మాజీమంత్రి మైసూరారెడ్డి

కృష్ణా, గోదావరి నదుల యాజమాన్య బోర్డుల పరిధిని నిర్దేశిస్తూ కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన గెజిట్‌ గ్రేటర్‌ రాయలసీమకు గొడ్డలి పెట్టు అని మాజీ మంత్రి మైసూరారెడ్డి అన్నారు. దీనివల్ల హంద్రీ-నీవా, గాలేరు-నగరి, తెలుగు గంగ, వెలుగొండ, సోమశిల, కండలేరు ప్రాజెక్టులకు నీరొచ్చే పరిస్థితి ఉండదని ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ, తెలంగాణ మధ్య జలవివాదాలు నెలకొన్న నేపథ్యంలో మైసూరా రెడ్డి ఈ విధంగా స్పందించారు.

తెలుగు రాష్ట్రాల మధ్య చర్చించుకోవాల్సినవి, పరిష్కరించుకోవాల్సినవి చాలా గొడవలు ఉన్నాయి. ప్రస్తుతం జలవివాదం కళ్ల ముందుకు వచ్చింది. రాజకీయ లబ్ధి కోసం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రులు ఘర్షణపడి... కేంద్రం చేతిలో మొత్తం అధికారులు పెట్టేశారు. పిట్ట.. పిట్ట.. కొట్టుకుని పిల్లి చేతిలో పెట్టేశారనే సామెతలాగా చేస్తున్నారు. జల వివాదంపై చర్చించుకోవడానికి ముఖ్యమంత్రులకు భేషజాలెందుకు? కేంద్రం వైఖరితో గ్రేటర్​ రాయలసీమ ప్రాజెక్టులకు గొడ్డలిపెట్టు. రాయలసీమకే ప్రత్యేక ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగేదా?

-మైసూరా రెడ్డి, ఏపీ మాజీ మంత్రి

గ్రేటర్‌ రాయలసీమ ప్రాంతానికి ఓ ప్రభుత్వం ఉండి ఉంటే అన్యాయం జరిగేది కాదని మైసూరా రెడ్డి అభిప్రాయపడ్డారు. నదీజలాల వివాదాలపై ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు చర్చించుకోవాలని సూచించారు. రాష్ట్రానికి కేటాయించిన జలాలు ఆయా ప్రాజెక్టులకు కేటాయించుకునే స్వేచ్ఛ ఏపీకి ఉందన్నారు. రాయలసీమ హక్కుల గురించి రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు పోరాడలేకపోతోందని ఆయన ప్రశ్నించారు. ఈ పరిస్థితి రాష్ట్ర సమగ్రతకు మంచిది కాదన్నారు.

మాజీమంత్రి మైసూరారెడ్డి

ఇదీ చూడండి:ట్రైబ్యునల్ తీర్పు వచ్చే వరకు 50 శాతం కేటాయించాలి: కృష్ణాబోర్డుకు లేఖ

Krishna Water: తెలంగాణ చర్యలు రాజ్యాంగ విరుద్ధమని ఏపీ ప్రభుత్వం పిటిషన్‌

మంజీరా నదిలోకి కాళేశ్వర గంగ... పంటపొలాలు మురిసిపడంగా...

ABOUT THE AUTHOR

...view details