తెలంగాణ

telangana

ETV Bharat / state

పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న - తెలంగాణ వార్తలు

రాష్ట్రంలో అమలవుతున్న సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని సూచించారు. కాంగ్రెస్, భాజపాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు.

former minister jogu ramanna participated in graduates mlc elections campaign in hyderabad
పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలి: మాజీ మంత్రి జోగు రామన్న

By

Published : Mar 6, 2021, 5:47 PM IST

పట్టభద్రులు ఆలోచించి ఓటేయాలని మాజీ మంత్రి జోగు రామన్న కోరారు. రాష్ట్రంలో అమలవుతున్న వివిధ సంక్షేమ పథకాలు దేశంలో ఎక్కడా లేవని అభిప్రాయపడ్డారు. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని పట్టభద్రులతో ఆయన మాట్లాడారు. హైదరాబాద్-రంగారెడ్డి-మహబూబ్‌నగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో తెరాస పార్టీ అభ్యర్థి సురభి వాణీ దేవిని గెలిపించాలని కోరారు. మహిళా అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు.

కేంద్రంలో భాజపా ప్రభుత్వం ప్రజలపై అధిక పన్నుల భారం మోపుతోందని ఆరోపించారు. కాంగ్రెస్, భాజపాలకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో మున్సిపాలిటీ ఛైర్‌పర్సన్ స్రవంతి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ సత్తు వెంకట రమణ రెడ్డి, ఆకుల యాదగిరి, రాజు తదితరులు పాల్గొన్నారు.

ఇదీ చదవండి:తెరాసని ప్రశ్నించడానికి నన్ను గెలిపించండి: జానారెడ్డి

ABOUT THE AUTHOR

...view details