తెలంగాణ

telangana

ETV Bharat / state

"నేను పార్టీ మారడం లేదు.. అలాంటి అంశాలు ఉంటే చెబుతా" - టీడీపీ తాజా వార్తలు

Ganta Srinivas Rao: పార్టీ మారతున్నారంటూ తనపై వస్తున్న ప్రచారంపై.. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి గంటా శ్రీనివాస్​ స్పందించారు. తాను పార్టీ మారడం లేదని స్పష్టం చేశారు. బీజేపీ నేత కన్నా లక్షీనారాయణ, గంటాతో భేటీ కావటంతో పార్టీ మారుతున్నాడంటూ ప్రచారం కొనసాగింది.

Ganta Srinivas Rao
Ganta Srinivas Rao

By

Published : Dec 15, 2022, 3:01 PM IST

Updated : Dec 15, 2022, 3:12 PM IST

Ganta Srinivas Rao: తాను పార్టీ మారుతున్నానంటూ జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని టీడీపీ నేత, ఆంధ్రప్రదేశ్​ మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు స్పష్టం చేశారు. పార్టీ మారడం వంటి అంశాలు ఉంటే తానే చెప్తానని అన్నారు. విజయవాడలోని గంటా శ్రీనివాసరావు నివాసంలో బీజేపీ నేత కన్నా లక్ష్మీనారాయణ, టీడీపీ నేత బొండా ఉమామహేశ్వరరావు భేటీ కావడం రాజకీయ ప్రాధాన్యాన్ని సంతరించుకుంది. నిన్న కన్నా లక్ష్మీనారాయణ, జనసేన నేత నాదెండ్ల మనోహర్‌ భేటీ అయ్యారు.

ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొనటానికి విజయవాడ వచ్చిన కన్నా.. గంటాతో భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణతో తన భేటి సాధారణమైనదేనని.. ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని గంటా స్పష్టంచేశారు. వెలంపల్లి కుమార్తె పెళ్లి సందర్భంగా తాము కలిశామని ఆయన గంటా స్పష్టం చేశారు.

"ఎప్పుడు వచ్చినా అందరం కలుస్తుంటాం. అలాగే ఇప్పుడు అందరం కలిసి భోజనం చేశాము. అంతే తప్ప ఇందులో ఏ రాజకీయం లేదు. పార్టీ మారే ఉహగానాలు ఏవి నిజంకావు. ఏమైనా ఉంటే నేనే చెప్తాను." - గంటా శ్రీనివాసరావు, మాజీ మంత్రి

నేను పార్టీ మారడం లేదు: మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు

ఇవీ చదవండి:

Last Updated : Dec 15, 2022, 3:12 PM IST

ABOUT THE AUTHOR

...view details