కరోనా మహమ్మారి విజృంభిస్తున్న ప్రస్తుత సమయంలో రెసిడెంట్, జూనియర్ డాక్టర్ల సమ్మె విషయంలో మరోసారి పునరాలోచించాలని వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్ విజ్ఞప్తి చేశారు. కరోనా సమయంలో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలు కాపాడారని... వీరి సేవలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు. కరోనా మహమ్మారి ఇంకా పోలేదని ఇలాంటి సమయంలో జూనియర్, రెసిడెంట్ వైద్యులు సమ్మెకు దిగితే పేద ప్రజలు ఇబ్బంది పడతారని ఈటల రాజేందర్ విడుదల చేసిన ప్రకటనలో వివరించారు. ఈ ప్రస్తుత సమయంలో వైద్యో నారాయణో హరి అనే నానుడిని కరోనా నిజం చేసి చూపించిందన్నారు.
వైద్య సిబ్బంది డిమాండ్లను నెరవేర్చాలి: ఈటల - వైద్య ఆరోగ్యశాఖ మాజీ మంత్రి ఈటల రాజేందర్
ఇంతటి విపత్కర పరిస్థితుల్లో ప్రాణాలకు తెగించి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న వైద్యులు, వైద్య సిబ్బంది డిమాండ్లను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని మాజీ మంత్రి ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు.
ప్రస్తుతం అలాంటి వైద్యులు, వైద్య ఇబ్బంది పడుతున్నారని...ప్రభుత్వం వెంటనే స్పందించి వారు లేవనెత్తిన డిమాండ్లను నెరవేర్చాలని డిమాండ్ చేస్తున్నట్లు తెలిపారు. పెంచిన స్టైఫండ్ వెంటనే అందించి సమ్మె విరమింప చేయాలని కోరారు. తాను ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నంతకాలం డాక్టర్లకు, వైద్య సిబ్బందికి ఎలాంటి సమస్య వచ్చిన వెంటనే స్పందించి వారితో చర్చలు జరిపి ప్రజలకు ఎలాంటి ఉబ్బంది రాకుండా చూశానని తెలిపారు. ఇప్పుడున్న ప్రభుత్వ యంత్రాంగం కూడా వెంటనే స్పందించి వారి డిమాండ్లను నెరవేర్చాలని మంత్రి ఈటల అన్నారు.
ఇదీ చదవండి :'గాంధీలో మృత్యుంజయులు 44,335 మంది'