భాజపా జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో మాజీ మంత్రి ఈటల రాజేందర్ దిల్లీలో భేటీ అయ్యారు. సుమారు 40 నిమిషాల పాటు నడ్డాతో సమావేశమయ్యారు. ఈటలతో పాటు భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జ్ తరుణ్ చుగ్, మాజీ ఎంపీ వివేక్ ఉన్నారు.
జేపీ నడ్డాను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్ - eetala Rajender latest news
జేపీ నడ్డాను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్
19:08 May 31
జేపీ నడ్డాను కలిసిన మాజీ మంత్రి ఈటల రాజేందర్
ఈటలను రాష్ట్ర మంత్రి వర్గం నుంచి తొలగించిన అనంతరం ఆయన భాజపాలో చేరుతారనే ప్రచారం ఊపందుకున్న తరుణంలో ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. ఐదారు రోజుల్లో ఈటల హుజూరాబాద్ వెళ్లి వచ్చాక భాజపాలో చేరుతారని.. నియోజకవర్గానికి వెళ్లి వచ్చిన తర్వాతే ఎమ్మెల్యే పదవికి, తెరాసకు రాజీనామా చేయాలని ఈటల యోచిస్తున్నట్లు తెలుస్తోంది.
Last Updated : May 31, 2021, 7:58 PM IST