హుజూరాబాద్ ఎమ్మెల్యే పదవికి ఈటల రాజేందర్ ఇవాళ రాజీనామా చేయనున్నారు. ఉదయం 10 గంటల తర్వాత గన్‌పార్క్‌లో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి.. విలేకరులతో మాట్లాడాక అసెంబ్లీకి వెళ్లి అక్కడ స్పీకర్ కార్యాలయంలో రాజీనామా చేయాలని ఈటల నిర్ణయించుకున్నట్లు భాజపా వర్గాలు తెలిపాయి.
EATALA: ఎమ్మెల్యే పదవికి ఇవాళ రాజీనామా చేయనున్న ఈటల!
మాజీ మంత్రి ఈటల రాజేందర్ తన ఎమ్మెల్యే పదవికి నేడు రాజీనామా చేయనున్నారు. గన్‌పార్కులో అమరవీరుల స్థూపం వద్ద నివాళి అర్పించి.. అనంతరం రాజీనామా సమర్పించనున్నారు.
కమలదళంలో చేరిక ముహూర్తం సోమవారం ఖరారు కావడంతో అదే రోజు ఉదయం హైదరాబాద్ నుంచి ఈటల దిల్లీ బయల్దేరి వెళ్లనున్నారు. ఆయనతో పాటు కాంగ్రెస్ నుంచి సస్పెన్షన్‌కు గురైన ఆదిలాబాద్ మాజీ ఎంపీ రమేశ్ రాథోడ్, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్ రెడ్డి, తుల ఉమ తదితరులు భాజపాలో చేరనున్నారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాను కలిసి ఆయన సమక్షంలో చేరనున్నారు. లేదా పార్టీ కార్యాలయంలో సభ్యత్వం తీసుకున్నాక నడ్డాను కలవనున్నారు. తన వెంట వచ్చే నేతలు, భాజపా రాష్ట్ర ముఖ్యనేతలను దిల్లీకి తీసుకెళ్లేందుకు ఈటల ప్రత్యేక విమానాన్ని బుక్ చేసినట్లు.. అంతా కలిపి 100 మందికిపైగా దిల్లీకి వెళ్లే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఇదీ చూడండి: టీఎస్పీఎస్సీ ఛైర్మన్, విద్యా శాఖ ముఖ్య కార్యదర్శికి కోర్టు ధిక్కరణ నోటీసులు