తెలంగాణ

telangana

ETV Bharat / state

బాబ్లీపై తెలంగాణ సీఎం స్పందించరేం? - Former Maharashtra CM Ashok Chavan has criticized the Telangana cm

మహారాష్ట్ర మాజీ సీఎం అశోక్‌ చవాన్‌ తెలంగాణ ముఖ్యమంత్రిని విమర్శించారు. బాబ్లీ ప్రాజెక్టు వివాదంపై సీఎం కేసీఆర్​ ఎందుకు స్పందించట్లేదని ప్రశ్నించారు.

Former Maharashtra CM Ashok Chavan has criticized the Telangana Chief Minister.
బాబ్లీపై తెలంగాణ సీఎం స్పందించరేం?

By

Published : Jan 25, 2021, 8:52 AM IST

బాబ్లీ ప్రాజెక్టుపై తెలంగాణ ముఖ్యమంత్రి ఎందుకో స్పందించడం లేదని మహారాష్ట్ర మాజీ సీఎం, ప్రస్తుత ఆ రాష్ట్ర మంత్రి అశోక్‌ చవాన్‌ ఆరోపించారు.

మూడుసార్లు..

ఆదివారం మహారాష్ట్రలోని నాందేడ్‌ జిల్లా దమ్మాబాద్‌లోని భూమి పూజా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. బాబ్లీ ప్రాజెక్టు విషయమై తెలంగాణ, మహారాష్ట్రల మధ్య వివాదం ఉంది. రెండు రాష్ట్రాలు చర్చించుకోవడం ద్వారా సమస్యను పరిష్కరించుకోవాల్సిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మహారాష్ట్ర సీఎం దృష్టికీ తీసుకెళ్లా.. తెలంగాణ సీఎంకు మూడుసార్లు ఫోన్‌ చేశా, మూడుసార్లు లేఖలూ రాశా. కానీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చవాన్‌ తెలిపారు.

ఇదీ చదవండి:శూలంతో పొడిచి.. డంబెల్​తో కొట్టి.. కన్నకూతుళ్లనే చంపేశారు!

ABOUT THE AUTHOR

...view details