జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా - janasena party latest news
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ గుడ్‌బై చెప్పారు. పవన్ కల్యాణ్ ప్రజాసేవకే పూర్తి జీవితమని చెప్పి... మళ్లీ సినిమాల్లోకి వెళ్లారని లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు.
![జనసేనకు లక్ష్మీనారాయణ రాజీనామా CBI Ex JD laximinarayana latest news](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-5898796-296-5898796-1580389640365.jpg)
CBI Ex JD laximinarayana latest news
జనసేన పార్టీకి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ రాజీనామా చేశారు. పవన్ మళ్లీ సినిమాల్లో నటిస్తున్నారనే రాజీనామా చేసినట్లు వెల్లడించారు. ఈ మేరకు జనసేన అధినేతకు రాజీనామా లేఖ పంపారు. పవన్ కల్యాణ్‌లో నిలకడైన విధివిధానాలు లేవని లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. ప్రజాసేవకే పూర్తి జీవితమన్న పవన్... మళ్లీ సినిమాల్లోకి వెళ్లారని లక్ష్మీనారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో తన వెంట నడిచిన ప్రతి కార్యకర్తకు లక్ష్మీనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. వ్యక్తిగతంగా వారికి తోడుగా ఉంటానని హామీ ఇచ్చారు.
Last Updated : Jan 30, 2020, 7:59 PM IST