ప్రజా కవి వరవరరావు అనారోగ్యం దృష్ట్యా ఆయన కుటుంబం ఎంతో ఆందోళన చెందుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా, తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేఖ రాశారు. భీమా కోరేగాన్ కేసులో అరెస్టయిన వరవరరావు.. ప్రస్తుతం కరోనా బారిన పడి ముంబై నానావతి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని ఆయన లేఖలో వివరించారు.
వరవరరావును విడుదల చేయాలని ప్రధానికి జానారెడ్డి లేఖ - former clp leader janareddy leeter to prime minister to release varavararao
భీమా కోరేగాన్ కేసులో అరెస్టయిన వరవరరావు... కొవిడ్‌తో సహా పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని.. అందుకని ఆయన్ను మధ్యంతర బెయిల్‌పై విడుదల చేయాలంటూ ప్రధాని మోదీ, కేంద్ర హోంశాఖ అమిత్‌షా, రాష్ట్ర సీఎం కేసీఆర్‌కు మాజీ సీఎల్పీ నేత జానారెడ్డి లేఖ రాశారు.

వరవరరావు గురించి ప్రధానికి లేఖ రాసిన జానారెడ్డి
2004లో మావోయిస్టులతో జరిగిన చర్చల్లో వరవరరావు కీలకపాత్ర పోషించారని జానారెడ్డి అన్నారు. ఆయన కొవిడ్‌తో పాటు ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని లేఖలో తెలిపారు. వీటన్నింటిని దృష్టిలో పెట్టుకుని మధ్యంతర బెయిల్‌పై ఆయన విడుదల చేసేందుకు చొరవ తీసుకోవాలని కోరారు.
ఇవీ చూడండి:వ్యవసాయ శాఖ క్రియాశీలకంగా మారాలి: సీఎం
Last Updated : Jul 23, 2020, 6:19 PM IST