తెలంగాణ

telangana

ETV Bharat / state

CBI Former JD: కౌలు రైతుల కష్టాలు తెలుసుకునేందుకే సాగు చేస్తున్నా..! - వ్యవసాయం చేస్తున్న సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ

రైతన్న పండించిన పంటలతో మనం ప్రశాంతంగా జీవిస్తుంటే.. రైతు మాత్రం అప్పులు ఊబిలో కూరుకుపోతున్నారని సీబీఐ మాజీ  జేడీ లక్ష్మీనారాయణ ఆవేదన వ్యక్తం చేశారు. కౌలు రైతుల కష్ట నష్టాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచనతోనే 12 ఎకరాలు కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నానన్నారు.

CBI Former JD
కౌలు రైతుల కష్టాలు

By

Published : Jun 24, 2021, 7:00 PM IST

కౌలు రైతుల కష్ట నష్టాలు అనుభవ పూర్వకంగా తెలుసుకోవాలనే ఆలోచనతోనే వ్యవసాయం చేస్తున్నానని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీ నారాయణ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడులో 12 ఎకరాల భూమిని కౌలుకు తీసుకుని ఈరోజు ఏరువాక సాగించినట్లు వెల్లండించారు. ఏరువాక సాగిన అనంతరం స్థానిక రైతులను లక్ష్మీనారాయణ సత్కరించారు.

రైతు నిత్య శ్రామికుడు. కరోనా లాంటి కష్ట సమయంలోనూ విరామం లేకుండా పని చేసే వ్యక్తే రైతు. అన్నదాతలు పండించిన పంటలతో మనం ప్రశాంతంగా జీవిస్తున్నాం. వారు మాత్రం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. యువత భాగస్వామ్యంతో మెట్ట ప్రాంతంలో వ్యవసాయ పరిస్థితులను అధ్యయనం చేయాలేనే ఆలోచనతో ఉన్నాను.

- లక్ష్మీ నారాయణ, సీబీఐ మాజీ జేడీ

ఇదీ చదవండి:kaleshwaram:కాళేశ్వరం నుంచి నిర్విరామంగా కొనసాగుతున్న నీటి ఎత్తిపోతల

ABOUT THE AUTHOR

...view details