తెలంగాణ

telangana

ETV Bharat / state

ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ యాత్ర: లక్ష్మీనారాయణ - Telangana News Updates

సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో గ్రామోదయ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​, టెక్నాలజీ ఆధ్వర్యంలో 'కుంభ్​ సందేశ్క- కరోనా అనంతర ప్రపంచానికి ఆవశ్యకత'పై సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ హాజరయ్యారు.

ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ యాత్ర: లక్ష్మీనారాయణ
ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ యాత్ర: లక్ష్మీనారాయణ

By

Published : Jan 20, 2021, 7:56 PM IST

ప్రజల్లో అవగాహన పెంచేందుకే ఈ యాత్ర: లక్ష్మీనారాయణ

భారత్​ను విశ్వగురు స్థానంలో నిలబెట్టడానికి అంతా కృషి చేయాలని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ పేర్కొన్నారు. హైదరాబాద్​ సోమాజిగూడ ప్రెస్​క్లబ్​లో గ్రామోదయ ఛాంబర్​ ఆఫ్​ కామర్స్​, టెక్నాలజీ ఆధ్వర్యంలో 'కుంభ్​ సందేశ్​ - కరోనా అనంతర ప్రపంచానికి ఆవశ్యకత'పై జరిగిన రౌండ్​ టేబుల్​ సమావేశానికి లక్ష్మీనారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ కార్యక్రమంలో భారతీయం చల్లా సత్యవాణి, ఐఎస్ఆర్ సంస్థ ఛైర్మన్ మంకెన శ్రీనివాసరెడ్డి, పద్మశ్రీ దాసరి ప్రసాదరావు, వ్యక్తిత్వ వికాస నిపుణుడు గంపా నాగేశ్వరరావు, ప్రకృతి రైతు గుడివాడ నాగరత్నం నాయుడు పాల్గొన్నారు.

జీకాట్ కన్వీనర్‌ దామస్త వసంత్‌కుమార్ (దిల్లీ వసంత్) నేతృత్వంలో కుంభ్ సందేశ్ పేరిట జరగనున్న యాత్ర ద్వారా సందేశం దేశానికి తెలియజేయడానికి సన్నద్ధమవుతున్న వేళ ఈ సమావేశం ప్రాధాన్యత సంతరించుకుంది.

ప్రపంచం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు, సాధు సంతులు, రాజకీయ నాయకులు, కార్పొరేట్, ప్రైవేటు కంపెనీల యజమానులు వచ్చే కుంభమేళా సందేశం, సంకల్పం... కొవిడ్ నేపథ్యంలో ఆవశ్యకత ఏంటి? ఆధునిక అవసరాలకు తగ్గట్టుగా ఎలా అన్వయించుకోవాలో ప్రజల్లో అవగాహన కల్పనే ఈ యాత్ర లక్ష్యం.

తొలుత ఆదిలాబాద్ నుంచి చేపట్టాలనుకున్నా... పెద్దల సూచనల మేరకు దిల్లీ నుంచి సాగనున్న కుంభ్ సందేశ్ యాత్ర విధివిధానాలు, రూట్‌మ్యాప్‌పై చర్చించేందుకు ఈ నెల 22, 23న దిల్లీ వసంత్ బృందం హరిద్వార్‌లో పర్యటించనుంది.

ఇవీ చూడండి:నవకల్పన సూచీలో తెలంగాణకు 4వ స్థానం

ABOUT THE AUTHOR

...view details