తెలంగాణ

telangana

ETV Bharat / state

హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచడం పట్ల భాజపా మాజీ ఎమ్మెల్సీ హర్షం - హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచడం పట్ల భాజపా హర్షం

తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచడాన్ని భాజపా నేత మాజీ ఎమ్మెల్సీ రామచందర్​రావు స్వాగతించారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్‌, కిషన్‌రెడ్డిలతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు.

Telangana news
తెలంగాణ వార్తలు

By

Published : Jun 9, 2021, 9:34 PM IST

తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తుల సంఖ్యను 24 నుంచి 42కు పెంచడం పట్ల భాజపా మాజీ ఎమ్మెల్సీ రామచందర్​రావు హర్షం వ్యక్తం చేశారు. గతంలో కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, లక్ష్మణ్‌తో పాటు పలువులు భాజపా నేతలు కేంద్రమంత్రి రవిశంకర్‌ప్రసాద్‌ కలిసి హైకోర్టు న్యాయమూర్తుల సంఖ్య పెంచాలని కోరినట్లు తెలిపారు.

ఈ సందర్భంగా కేంద్ర మంత్రులు రవిశంకర్‌ప్రసాద్‌, కిషన్‌రెడ్డిలతో పాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణకు ధన్యవాదాలు తెలిపారు. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఎన్వీ రమణ చొరవతో ఇది సాధ్యమైందన్నారు.

ఇదీ చూడండి:corona cases: రాష్ట్రంలో కొత్తగా 1,813 కరోనా కేసులు నమోదు

ABOUT THE AUTHOR

...view details